ప్రభుత్వం విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ZP ప్రభుత్వబాలుర ఉన్నత పాఠశాల నందు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్రరెడ్డి బియ్యపు ప్రారంభించారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.
చదువుతోనే పేదరికం నుంచి బయటపడతాం. చదువుతోనే జీవితాల రూపురేఖలు మారతాయన్న. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం’అదే బాటలో నేడు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తూ చదువుతోనే పేదరికం రూపుమాపాలని విద్యార్థులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి పాఠశాలలను నాడునేడు పథకం కింద సుందరీకరణం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారబాటు వేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇంత కృషి చేస్తున్న ముఖ్యమంత్రివర్యులువైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్దుల తల్లిదండ్రులు రుణపడిఉండలని, విద్యార్థులకు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగించి, విద్యార్థుల భవిష్యత్తుకు
బంగారుబాట వేయాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ భువనేశ్వరి,వైఎస్ఆర్సీపీ నాయకులు, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment