టిటిడిలోని పాత రికార్డులను డిజిటైజ్ చేయాలి
పరిపాలనా భవనంలోని పలు కార్యాలయాలను పరిశీలించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
టిటిడి పరిపాలనా భవనంలోని రికార్డు రూమ్‌లో 1933 నుంచి ఉన్న ప్రతి రికార్డును డిజిటైజ్ చేసి భద్రపరచాలని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని రికార్డు రూములతో పాటు పలు కార్యాలయాలను బుధవారం ఆయన పరిశీలించారు. పాత ఓచర్లు, బిల్లులు, సర్వీస్ రిజిస్టర్లు ఇతర ఫైళ్లు భద్రపరిచిన విధానాన్ని ఈవో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అవసరం లేని రికార్డులన్నీ తొలగించి కార్యాలయాల్లో వృథాగా ఉన్న ఫర్నీచర్‌ను వెంటనే డిపిడబ్ల్యు స్టోర్‌కు పంపాలన్నారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఫైళ్లు మొదలైనవి డిజిటైజ్ చేసి అవసరమైనపుడు వాటిని పరిశీలించేందుకు అనుగుణంగా ఐటి అప్లికేషన్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమాచారం మొత్తం టిటిడి సర్వర్‌లో భద్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా భవనంలోని కార్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన వీటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, విజివో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment