నేటి తరం విద్యార్థుల పైనే దేశ భవిష్యత్తు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, July 18, 2022

నేటి తరం విద్యార్థుల పైనే దేశ భవిష్యత్తు

 నేటి తరం విద్యార్థుల పైనే దేశ భవిష్యత్తు







మీరు కష్టపడి సాదించిన విజయాలు మీ తల్లిదండ్రుల కళ్ళలో చూడండి , మనది పోలీస్ కుటుంబం మనమంతా ఒక్కటే
జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు...
దేశ భవిష్యత్తు నేటి తరం విద్యార్థుల పైనే ఉందని ప్రతి ఒక్కరు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు అన్నారు.
పోలీస్ కుటుంబాల సంక్షేమంలో భాగంగా చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించిన 75 మంది పోలీస్ పిల్లలకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందజేత.
పోలీస్ పిల్లల సంక్షేమంలో భాగంగా 2021-2022 సంవత్సరంలో చదువుల్లో ప్రతిభ కనుబరిచిన 75 మంది పోలీస్ పిల్లలకు ప్రతిభా పురస్కారాలు మరియు జ్ఞాపికలను అందజేశారు.
విద్యార్థి దశ నుండే కోరుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని నేరవేర్చినప్పుడే మంచి జీవితం, భవిష్యత్తు ఏర్పడుతుందని జిల్లా యస్.పి గారు అభిప్రాయ పడ్డారు.
ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాలు అందజేత కార్యక్రమంలో జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు ముఖ్య అతిదిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు అధ్యక్షత వహించి విజయవంతంగా జరిపించారు.
జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ పోలీస్ కుటుంబాల సంక్షేమం మరియు ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర డి.జి.పి శ్రీ కే.వి.రాజేంద్రనాద్ రెడ్డి, ఐ.పి.యస్ గారు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పిల్లలను గుర్తించి వారికి ప్రోత్సాహక పురస్కారాలు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
ప్రతిభ పురష్కారాలు అందుకున్న అందరికి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మన పోలీస్ కుటుంబంలో మన పిల్లలు సాధించిన విజయాలను మనమందరం కలసి ఆనందంగా ఇక్కడ జరుపుకోవడం మిక్కిలి సంతోషించదగ్గ విషయమన్నారు.
ముఖ్యంగా సమాజం కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే పిల్లలను పోలీస్ సిబ్బంది బాగా చదివించడం అబినందనీయమన్నారు.
పోలీసు విధుల్లో మనం ప్రజా సేవ కోసం రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నాం. మనం ఎంత కష్ట పడినా మన పిల్లల విజయాలే మనకు ఆనందం.
క్రింది స్థాయి సిబ్బంది పిల్లలు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని కష్టపడి చదివి పైకి రావడం గర్వకారణం. అనుకున్న ఫలితాలు రాకపోతే క్రుంగిపోకండి. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. సరైన ఫలితాలు రానివారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఓటమి విజయానికి నాంది అనే నానుడితో చిన్న చిన్న అవాంతరాలను అధిగమించి మంచి ఫలితాలను రాబట్టినప్పుడు ఆ అనందం చాలా గొప్పదిగా ఉంటుందన్నారు.
జిల్లాలో 75 మంది పోలీస్ పిల్లలకు ప్రతిభా పురస్కారాలు రావడం గర్వించదగ్గ విషయమని ఇందులో పదవ తరగతి నుండి ఇంటర్, బి టెక్, బి.ఫార్మసీ, యం.బి.బి.యస్ వరకు ఉన్నారు. కష్టపడితే సాదించరానిదంటూ ఏమీ లేదని చిన్న తనం నుండే ఉన్నత స్థాయికి చేరుకోవాలనే అభిలాషతో, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఇది ఒక్క చదువుతోనే సాధ్యమవుతుందని అన్నారు.
అంతే కాకుండా మీరు ఎన్నుకున్న ఏ రంగమైనా కావొచ్చు, అది క్రీడలైన లేదా మరి ఏ ఇతరాత్ర విభాగాల్లో కృషితో ముందడుగు వేస్తే మరింత ఉన్నత శిఖరాలకు వెల్లవచ్చోని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కటినమైన పోలీస్ ఉద్యోగ భాధ్యతలను నెరవేరుస్తూ ఒక ప్రక్క పిల్లల పట్ల శ్రద్ద చూపి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో సిబ్బంది చేస్తున కృషి అభినందించదగ్గ విషయమన్నారు.
అనంతరం పదవ తరగతి నుండి ఇంటర్, బి టెక్, బి.ఫార్మసీ, యం.బి.బి.యస్ వరకు 2021 -2022 విద్యాసంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పిల్లలకు రూ.8,000/-, రూ.9,000/- రూ.10,000/-, రూ.20,000/- వరకు నగదు పురస్కారాలను జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు యస్.బి రమణ, వెస్ట్ నరసప్ప, ట్రాఫిక్ కాటమరాజు, యస్.సి యస్.టి సెల్ నాగ సుబ్బన్న, కమాండ్ కంట్రోల్ కొండయ్య, ఏ.ఆర్ నంద కిషోర్, క్రైమ్ సి.ఐ శ్రీనివాసులు, ఆర్.ఐ లు అడ్మిన్ చంద్రశేఖర్, వెల్ఫేర్ నాగభూషణం, అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొనడం జరింగింది

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad