శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆక్సిజన్ ప్లాంటును లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కై రోగులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆ ఇబ్బందులను గమనించిన ప్లాంటును విరాళంగా ఇచ్చిన దాత శ్రీకాళహస్తి నివాసస్థుడు హేమంత్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దాతలు ఈదే విధంగా ముందుకు వచ్చి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి పరిచే విధంగా ప్రతి ఒక దాత ముందుకు రావాలని దాతలకు పిలుపునిచ్చారు. ఆసుపత్రికి కావాల్సిన వసతులను వైద్య సామాగ్రిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన తీసుకొని వస్తానని వైద్యులకు హామీ ఇచ్చారు .సుధీర తీరాల నుంచే రోగులకుమెరుగైన వైద్య చికిత్స అందించండి అంటూ వైద్యులను కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పగడాలరాజు,వయ్యాల కృష్ణారెడ్డి, పసల సుమతి,రామచంద్రారెడ్డి,కొల్లూరు హరి,చిలకా గోపి,యానాదయ్య,బాబు, పెరుమాళ్,మాధవయ్య,కిరణ్, ఋషేంద్ర మని,ఇందిరా మరియు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment