శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానమునకు విరాళం రూ.50,116/-
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానమునకు విరాళంగా నాయుడుపేట, మారేపల్లి వాస్తవ్యులు నెల్లూరు సాయి కుమార్ రెడ్డి కుటుంబం వారు రూ.50,116/- (యాభైవేల నూట పదహారు రూపాయలు) విరాళంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు. స్వామి-ఆమ్మ వార్ల సేవలో భాగంగా అన్నదాన ప్రసాదాలకు విరాళాలు అందజేసిన వారి కుటుంబానికి తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉంటాయని ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment