శ్రీకాళహస్తి పట్టణము నందు 33 వార్డు నందు మెప్మా ఆధ్వర్యంలో
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ స్వర్ణముఖి మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశము శ్రీ రామ్ నగర్ కాలనీ స్వశక్తి భవనం ఆవరణములో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ఆఫీసర్, డి సి సి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గారు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్రాంచ్ మేనేజర్ గారు మరియు ఫీల్డ్ ఆఫీసర్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు నుండి అందిస్తున్న రుణాల గురించి ఇన్సూరెన్స్ లు గురించి ఎడ్యుకేషన్ లోన్ గురించి హౌసింగ్ లోన్స్ గురించి చెప్పడం జరిగినది.అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి నవరత్నాలు పథకాల గురించి వివరంగా ప్రజలకి తెలపడం జరిగినది.అదే విధంగా సమాఖ్య ఆదాయ వ్యయాలను ఆడిట్ ద్వారా తెలియజేయడం జరిగినది.అదేవిధంగా రాబోయే రోజుల్లో పొదుపు పెంచుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇంకా అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలని తెలియజేయడం జరిగినది.ఈ సమావేశంలో సిటీ మిషన్ మేనేజర్ ప్రసాద్ గారు,కమ్యూనిటీ ఆర్గనైజర్
కావమ్మ , పట్టణ సమైక్య అధ్యక్షురాలు, రిసోర్స్ పర్సన్స్, సమాఖ్య అధ్యక్షులు రాధమ్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment