మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదుల పై ప్రత్యేక శ్రద్ధ చూపండి : డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి యస్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 7, 2022

మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదుల పై ప్రత్యేక శ్రద్ధ చూపండి : డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి యస్

మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదుల పై ప్రత్యేక శ్రద్ధ చూపండి : డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి యస్


స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:

మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదుల పై ప్రత్యేక శ్రద్ధ చూపండి. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక చర్యలు చేపట్టండి అనంతపూర్ రేంజ్ డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి యస్

ఎమ్.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించిన అనంతపూర్ రేంజ్ డిఐజి శ్రీ రవి ప్రకాష్ ఐ.పి యస్..
మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి సకాలంలో న్యాయం చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీ రవి ప్రకాష్ ఐ.పి.యస్ గారు తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ పి పరమేశ్వర రెడ్డీ ఐ.పి.యస్ గారితో కలిసి బుధవారం ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లోని రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో డిఐజి గారు సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల ఫిర్యాదుల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కేసులో పురోగతి సాధించాలని . ఇలాంటి కేసులు పట్ల అశ్రద్ధ వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, చిన్న పిల్లల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలందరికీ దిశ యాప్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఉందన్నారు.
రోడ్డు ప్రమాదాల పై ప్రతి ఒక్క పోలీసు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆ ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైతే బారికేడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. హైవే రోడ్డు పై ఎవరైనా వాహనాలు ఆపి ఉంచితే అలాంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలు రోడ్డు పక్కన నిలబెట్టుకునేలా చూడాలన్నారు.
దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించండి
నగరంలో దొంగతనాలు పెరిగి పోకుండా వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయంలో నిరంతరం బీట్ల ను అధికారులు తరువు గా తనిఖీలు చేయాలన్నారు. రాత్రి సమయంలో ఆ శ్రద్ధ వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిరంతరం దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పీడీ యాక్ట్ లు నమోదు చేయాలన్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ నేరాలను నియంత్రించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజలందరికీ ఎక్కడైనా ఊరికి వెళితే పోలీస్ కెమెరాలు అయిన ఎల్ హెచ్ ఎం ఎస్ గురించి అవగాహన కల్పించి ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఇందులో వెస్ట్ సబ్ డివిజినల్ డీఎస్పీ నరసప్ప, సిఐ సురేందర్ రెడ్డి, యస్ఐ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad