ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, July 10, 2022

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

 ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు



శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకుందాం
తిరుపతి జిల్లా యస్.పి. శ్రీ.పి.పరమేశ్వర రెడ్డీ ఐ.పి.యస్...
బక్రీద్ పండుగ మరియు తోలి ఏకాదశీ పండుగ పర్వదినాలను పురస్కరించుకుని జిల్లా యస్.పి. శ్రీ.పరమేశ్వర రెడ్డీ, ఐ.పి.యస్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తిరుపతి ఒక శాంతి నిలయం ఇక్కడ అన్నీ మతాలు ఒక్కటే ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు.
అందరూ ఐక్యమత్యంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా మిత్ర భావంతో ప్రేమను పంచుకుంటూ పండుగ జరుపుకోవాలనీ ఆకాంక్షించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్ధన మందిరాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని శాంతి భద్రతలకు విగాథం కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందిగా నిర్వహించడం జరుగతుందన్నారు.
24 గంటలు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగా సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులపై జిల్లా పోలీస్ శాఖ గట్టి నిగా ఉంచిందని ఆకతాయి చేష్టలతో సోషల్ మీడియాలో వదంతులను ఉద్దేశిపూర్వకంగా సృష్టిస్తే వారిని ఉపేక్షించే లేదని హెచ్చరించారు.
సర్వ మతాలతొ సమ్మేళన మైన భారతావనిలో తిరుపతి నగరం ఒక ఆధ్యాత్మిక నగరం ఇక్కడ ఎలాంటి అలజడులకు తావు లేదు, మనం బాగుంటే మన చుట్టూ అందరూ బాగుంటారు. భిన్న భావాలు మన చుట్టూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు సోదర భావంతో ఎలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము ఇదే స్పూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
కరోనా ఫోర్త్ వే సమస్య కూడా ఉన్నందున ప్రార్థనలకు వెళ్ళు సోదరులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు.
పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలలో తమ వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసి ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చూడాలని కోరారు
ఏదైనా ఘటన గురించి ముందస్తు చట్టబద్ధమైన సమాచారం ఇస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దనీ సూచించారు.
ముఖ్యంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మరియు బహిరంగ ప్రదేశాల వద్ద ఎలాంటి జీవ హింస చేయరాదన్నారు.
ఏదైనా సమాచరం ఉంటే Dial 100, Police Whatsapp No. 80999 99977 , 79898 07665 నంబర్ కు సమాచారము అందించి ప్రజలు సహకరించాలని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు ఒక ప్రకటనలో వెల్లడించారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad