పేద ప్రజల గుండెల చప్పుడు Y.S.R... అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రజా బంధు, పేదల పాలిటి పెన్నిధి, రైతు బాంధవ్యుడు ప్రజల గుండెచప్పుడులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా మహానీయుడు దివంగత నేత డాక్టర్ శ్రీ వై.యస్.రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ శ్రీకాళహస్తి పట్టణం నందు వైయస్సార్ సర్కిల్ వద్ద స్థానిక గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు భారీ అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులతో, మహిళలతో, కార్యకర్తలతో, అభిమానులతో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి, గజమాలలతో సత్కరించి జోహార్ Y.S.R అంటూ నినాదాలతో నివాళులు అర్పించి భారీగా ఏర్పాటు చేసిన అన్నదానాన్ని పేద ప్రజలందరికీ పంచిపెట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ నిజాయితీకి, నిస్వార్థానికి, నిలువెత్తు రూపం.. పంచకట్టుకైనా, నడకలో రాజసమైనా ఈ ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఆ మహా మహనీయుడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికే చెల్లుతుందని, ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు, రైతులకు అందించిన విద్యా ప్రదాత, ఆరోగ్య ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, రైతుల రుణమాఫీ లాంటి ఎన్నో సేవలు అందించి అందరి కుటుంబాల్లో వెలుగులు నింపి, యువతకు ఆదర్శంగా నిలిచి ఉన్నత స్థానాలలో ఉంచి, పేదల గుండెచప్పుడులలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారిని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన అయినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా లబ్ధిని చేకూరుస్తున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పగడాల రాజు, ఆలయ బోర్డు మెంబర్ మహిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉప్పు కృష్ణయ్య, పూల కృష్ణయ్య కొట్టే సత్యం, సురాగారి రమేష్, వెంకటేశ్వర్లు, చిరంజీవి, సెన్నేర్ కుప్పం శేఖర్, మొగరాల గణేష్, కంఠ ఉదయ్, కోళ్లూరు హరినాథ్ నాయుడు, పసల్ కుమార స్వామి, పత్తి మనీ, గోపీనాథ్, పూడి రవి, నరసింహా, చింతామణి, యానాదయ్య, జంలేషా భాయ్, జిలాని, ఆవుల శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, చాన్ భాష, హరి, వెంకటేశ్వర్లు, దూదేకుల బాబు, పుట్టం రాజా, బాలా గౌడ్, సుందరేష్, కళ్యాణ్, ప్రసాద్, తేజ, సునీల్ తదితర పార్టీ నాయకులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment