ఆరడుగుల పొడవున్న నాగుపాము భక్తులు హడల్ ::తిరుమల
తిరుమల:
అలిపిరి కాలినడక మార్గంలో సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము భక్తులను హడలెత్తించింది. అడవి నుంచి 3,400 మెట్టుకు సమీపానికి వచ్చిన నాగుపామును చూసి.. భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గర్లోని భద్రతా సిబ్బంది వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయనొచ్చి.. ఆ పామును చాకచక్యంతోపట్టుకుని, దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.
No comments:
Post a Comment