నేడు వైద్యుల దినోత్సవ దినోత్సవం
అనుక్షణం ఆరోగ్యాన్ని , శారీరక, మానసిక స్థైర్యాల్ని అందించే ఈవైద్య నారాయణులకు ఏమిచ్చి రుణము తీర్చుకోవాలి? డాక్టరు చికిత్స చేసేశాడు, రోగి ఫీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణము తీరిపోతుందా? ఆ బంధము తెగిపోతుందా? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణము కృతజ్ఞతను నింపుకుని పదేపదే గుర్తు చేస్తూ ఉంటుంది కదూ. అందుకే ఈ వైద్యులకోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించింది. అదే ప్రపంచ డాక్టర్స్ డే దినోత్సవం. వాళ్లను గుర్తు పెట్టుకుని ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో చల్లగా ఉండాలని దేవున్ని ప్రార్ధించి శుభాకాంక్షలు తెలియజేస్తారు.
వైద్యుల దినోత్సవం చరిత్ర
మన దేశంలో 1991నుంచి డాక్టర్స్‌డే నిర్వహించడం ప్రారంభమైంది. డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ జూలై 1,1882న జన్మించారు, జూలై 1, 1962 మరణిచారు ఆయన గౌరవర్థం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బిదాన్ చంద్ర రాయ్ కలకత్తా మెడికల్‌కాలేజీలో చదివారు. ఆ తరువాత ఆరోగ్యశాఖలో చేరారు. ఉన్నత చదువుల కోసం రాయ్ చేసుకున్న అభ్యర్థనను ఆ సంస్థ డీన్ పలుమార్లు తిరస్కరించారు. అయినా పట్టు వదలకపోవడంతో ప్రవేశాన్ని కల్పించారు. కేవలం రెండేళ్ల మూడు నెలల్లో ఎంఆర్‌సీపీ, ఎఫ్‌ఆర్‌సీఎస్(1911లో) పూర్తి చేసిన అరుదైన వ్యక్తి రాయ్. అనంతరం కలకత్తాలోనే ప్రాక్టీసు ప్రారంభించారు. కలరా విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రాణాల్ని కాపాడారు. జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా వెన్నంటి నడిచారు. 1961లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు. ఆయన స్ఫూర్తి కొనసాగించేందుకు ‘డాక్టర్స్‌డే’ ను నిర్వహిస్తున్నారు.
ప్రసుత్తం భారతదేశం కోవిడ్19 మహమ్మారితో సతమతమౌవుతోంది. ఈ విపత్కర సమయంలో పోలీస్ శాఖ, డాక్టర్లు ప్రజలకు చేస్తున్న ఎనలేని సేవను ఏవిధంగా కొనియాడగలం. ముఖ్యంగా డాక్టర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కోవిడ్ బాధితులకు 24 గంటలు సేవలందిస్తున్నారు. వైద్యో నారాయణ హరి అనే పదానికి అర్థమిచ్చేలా వారి చేస్తున్న సేవ ప్రశంసించదగ్గది, చిరస్మణీయమైనది.
No comments:
Post a Comment