శ్రీసిటీని సందర్శించిన తిరుపతి జాయింట్ కలెక్టర్
శ్రీసిటీ,
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ డైరెక్టర్ ముకుంద రెడ్డి ఆయనకు సాదరస్వాగతం పలికి, పారిశ్రామికవాడ ప్రగతి, ప్రత్యేకతల గురించి వివరించారు. సూళూరుపేట రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ కెఎం రోజ్‌మండ్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ఎస్ఎస్ సోనీ, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల తహసీల్దార్లు జెసి పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రాంతంలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలతో పాటు ఇసుజు, ఎవర్టన్ టీ పరిశ్రమలను సందర్శించారు.
No comments:
Post a Comment