11 లక్షల రూపాయల విలువ కలిగిన 10 ఎర్ర చందనం దుంగలు మరియు ఒక స్కార్పియో వాహనము స్వాధీనం. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 2, 2022

11 లక్షల రూపాయల విలువ కలిగిన 10 ఎర్ర చందనం దుంగలు మరియు ఒక స్కార్పియో వాహనము స్వాధీనం.

 చిత్తూరు జిల్లా లో ఎర్ర చందనం స్వాధీనం, అంతర్రాష్ట్ర ఎర్ర చందనం దొంగ అరెస్ట్. 

 

11 లక్షల రూపాయల విలువ కలిగిన 10 ఎర్ర చందనం దుంగలు మరియు ఒక స్కార్పియో వాహనము స్వాధీనం.

 చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల నుండి ఎర్ర చందనం దుంగల అక్రమ  రవాణా పై చిత్తూరు జిల్లా  S.P.  శ్రీ. Y. రిశాంత్ రెడ్డి,  I.P.S.   గారి  ఆదేశాల మీరకు చిత్తూరు  SDPO  శ్రీ N. సుధాకర్ రెడ్డి, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించడం జరిగినది. ఈ కార్యాచరణంలో భాగంగా రాబడిన రహస్య సమాచారం మేరకు గుడిపాల S.I. శ్రీ కె.రాజశేఖర్ మరియు సిబ్బంది ది.01.07.2022వ తేది మద్యాహ్నం చెన్నై-బెంగుళూరు రోడ్ లోని MCR క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా చిత్తూరు వైపు నుండి చెన్నై వైపు అతివేగంగా, అనుమాస్పదంగా ఒక స్కార్పియో వాహనం చిత్తూరు వైపు నుండి వస్తూ వుండగా, సదరు వాహనం ను స్వాధీనం చేసుకొని దానిని తనిఖీ చేయగా అందులో గల డ్రైవర్ అదుపులోకి తీసుకొనగా, మిగిలిన ఇద్దరు మగ వ్యక్తులు పారిపోయినారు, వీరు ముగ్గురు మరికొంత మందితో కలిసి ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే ముఠా వున్నారు. సదరు వాహనం లో 10 ఎర్ర చందనం దుంగలు ఉండినాయి, వాటి మొత్తం బరువు 164 KG  లు కలిగి సుమారు  11  లక్షల రూపాయలు విలువ ఉండును, సదరు 10 ఎర్ర చందనం దుంగలను, ఒక స్కార్పియో వాహనము విలువ సుమారు 5 లక్షలు ను స్వాధీనం చేసుకొని వారిపైన గుడిపాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం అయినది.  

అరెస్టు కాబడిన ముద్దాయి వివరాలు:

P.గోపి, వయస్సు: 35 సంవత్సరములు, తండ్రి: లేట్ సి.పళని, ఇంటి నెం.120, మరియమ్మ గుడి వీది, మాంబట్టు గ్రామము మరియు పోస్ట్, పోలూర్ తాలూకా, తిరువన్నామలై జిల్లా, తమిళనాడు రాష్ట్రము.

పైన తెలిపిన ముద్దాయి కాకుండా ఇంకా పైన తెలిపిన వారికి సహచరులు అయిన తమిళనాడుకు చెందిన ప్రధాన స్మగ్లర్లు ఐదుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకొని జైలుకు పంపబడును

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad