విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల లో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం DG గారైన శ్రీ శంఖ బ్రత బాగ్చి IPS గారి ఆదేశం ప్రకారం తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన శ్రీ కె. ఈశ్వర రెడ్డి తిరుపతి, చిత్తూరు జిల్లాలో లో ఏర్పేడు మండలం లోని పల్లం గ్రామంలో గల సాంఘిక సంక్షేమ హాస్టళ్, పులిచేర్ల మండలం మంగళంపేట గ్రామం లోని బీసీ బాలుర హాస్టల్, పిచాటుర్ మండలం లోని వెంగలట్టుర్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ హస్టళ్, మరియు కార్వేటినగరం మండలం కట్టెరపల్లి గ్రామంలోకల బీసీ బాలుర హాస్టల్ లో, ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయి అని అంతే గాక వసతి గృహాలలో వసతులు, సౌకర్యాలు, రక్షణ, నిర్వహణ మరియు లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అని శ్రీ ఈశ్వర రెడ్డి గారు తెలిపారు.
No comments:
Post a Comment