శివయ్య భక్తులకే కష్టాలు కలిగిస్తే శివయ్య ఊరుకోడు : బొజ్జల సుధీర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం లో నాగపడగల కొరత కారణంగా ఆగిన రాహుకేతు పూజల గురించి EO గారికి వినతిపత్రం ఇచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డి
మా నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు రాహుకేతు పూజలను ప్రారంభించిన సంగతి అందరికి తెలుసు
బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న నాగపడగల కొరతతో ఆగిన రాహు కేతు పూజల వాళ్ళ ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర మనస్తాపంతో బాధతో వెళ్లడం చూస్తుంటే ఈ దేవస్థానంలో అసలు ప్రణాళిక పరంగా భక్తులకు సౌకర్యాలు కల్పిండంలో విఫలమైన అధికారులు
రాహు కేతు పూజలలో భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారని దోచుకున్న సొమ్ము ని ఎవరికీ వాటాలు పంపుతున్నారో శివుడు చూస్తున్నాడు
దేవుడి సొమ్ము ఎవరూ తిన్న జీవితంలో బాగుపడరని అన్నారు
గతంలో మా అమ్మగారు గోశాల, అన్నదానం సక్రమంగా నిర్వహించడంలో తగుసూచనలు చేస్తే ఏదో మేము దోపిడీ చేశామని విషప్రచారం చేసారు అయితే ఈ ప్రభుత్వం దానిని నిరూపించాలని డిమాండ్ చేశారు
ఈ రోజు గోశాల అద్వానంగా మారిందని, అన్నదానo లో అసలు శుభ్రత లేదన్నారు
ఇక్కడ దళారీ వ్యవస్థ నడుస్తుందని భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు,దీనిని అరికటకపోతే ధర్నా చేయాల్సివస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment