శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట చట్ట విరుద్ధ ఘటనలపై ఉక్కు పాదం. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, July 19, 2022

శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట చట్ట విరుద్ధ ఘటనలపై ఉక్కు పాదం.

 శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట చట్ట విరుద్ధ ఘటనలపై ఉక్కు పాదం.





జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్


నేర నియంత్రణకు విజిబుల్ పోలీసింగే ప్రధాన ఆయుధం హాట్ టైమ్ లో పోలీసింగ్ ఉంటేనే నేరాలను నివారించ గలుగుతాము.


కారణం లేకుండా తిరగటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు.


ప్రజలకు మనం జవాబుదారీతనం అనే విషయాన్ని గుర్తుంచు కోవాలి.


మరలా మరలా నేరాలు జరుగుతున్నాయి అంటే మనం బాధ్యతగా పని చేయటం లేదని అర్థం. 


డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షణ చాలా అవసరం అదికారులు సక్రమంగా ఉంటే క్రింది స్థాయి సిబ్బంది మార్గదర్శకంగా విధులు నిర్వహిస్తారు.


తెలిసి తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు.


ప్రజల కోసం పని చేయండి అదికరులకోసం కాదు. 


అధికారులు తీరు మార్చుకో లేకపోతే మూల్యం చెల్లించక తప్పదనీ  జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు హెచ్చరించారు.


తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ గారు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.


 బుధవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్  హాల్ నందు నెలవారి సమీక్ష సమావేశం లో పోలీస్ అధికారులతో సమావేశమై  కేసు వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.


 కేసులు నమోదు చేయు విషయంలో ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా వ్యవహరించాలని కేసులను నమోదు చేసి కోర్టుకు పంపిన తర్వాత బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటే అది పొరపాటని పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టుకు సరైన ఆధారాలు చూపి బాధితులకు తగిన న్యాయం చేసినప్పుడే మన బాధ్యత ముగిస్తుందని అన్నారు.


 అధికారులు ఎప్పటికప్పుడు కోర్టు కేసుల విషయాల గురించి తెలుసుకొని కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి సరైన మార్గదర్శకాలను ఇవ్వాలని అన్నారు.


 ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అధికారులతో మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాపై ఉక్కు పా దం మోపాలని హాని కలిగించే మత్తు పదార్థాలు నాటు సారా, గాంజా,గుట్కా, కైని మొదలగు పదార్థాల నియంత్రణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.


 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల సమన్వయంతో అక్రమ మద్యం, అక్రమ రవాణా, నిషేధిత వస్తువులపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.


 హైవే రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తూ దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పిన్స్ ప్రింగర్ ప్రింట్ పరికరము ద్వారా వేలిముద్రలను గుర్తించి  విచారించాలని ఆదేశించారు.


 శ్రీనివాస సేతు (గరుడ వారది) పనులు దృష్ట్యా ట్రాఫిక్ లతో పాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ కై హైవే రహదారులపై రేడియం స్టిక్కర్ కలిగిన డ్రమ్ముల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


       జాతరలు, ఉత్సవాలు, జరిగినప్పుడు సి.సి.ఎస్ పోలసులు వారు దొంగ తనాలు, చైన్ స్నాచింగ్ లు జరగ కుండా నిరంతర నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.


       పేకాట, లాటరీ, మట్కా, కొడి పంద్యాలు ఆటలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తిగా నివారించాలి ఎక్కడైనా ఘటనలు జరిగినట్లు నా దృష్టికి వస్థే తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. 


       దొంగతనాలను అరికట్టడానికి ఎల్.హెచ్.ఎం.ఎస్ వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి తరచూ దొంగతనాలు జరుగు ప్రాంతాలలో బీట్ సిస్టంను బలోపేతం చేసి అక్కడ లర్కింగ్ పోలీసులను ఏర్పాటు చేయడమే కాకుండా రక్షక్ మరియు బ్లూ కొల్ట్ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


       స్పందన కార్యక్రమాలలో ఎక్కువ శాతం మహిళలు తమ సమస్యలను తెలుపుతున్నారని, ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దిశా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసిందని అన్నారు.


       మహిళల ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి వారికి సకాలంలో న్యాయం చేసే బాధ్యత మనపై ఉందని ఎన్నో రకాల బాధలు, సమస్యలు ఉంటే గాని పోలీస్ స్టేషన్ వరకు రారని అన్నారు. 


       మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన 'దిశ' యాప్ పై  అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అఫ్ యూజర్ నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.


       మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం మూడురోజుల లోపల సమగ్రమైన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.


       గత రెండు నెలలుగా గమనిస్తే ప్రతి రోజు క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయని మీటింగ్ లో ఏదో ఒకటి చెప్తాము, చేస్తాము అని అనుకుంటే ఇకపై కుదరదని నష్టం జరిగినప్పుడు పుడ్చే బాధ్యత కూడా తీసుకోక తప్పదని స్పష్టం చేస్తూ జిల్లా యస్.పి గారు హెచ్చరించారు. 


       ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు, L &O శ్రీ కులశేకర్, క్రైమ్ శ్రీమతి విమలా కుమారి మేడం గారు, యస్బి డీఎస్పీ వెంకటరమణ మరియు జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad