"విద్యకు ఎమ్మెల్యే బియ్యపు మధన్న చేదోడు"
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం,చిన్న కన్నలి ST కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిరుపేద కుటుంబానికి చెందిన పూజిత, జస్వంత్ (10thclass, పూడి జడ్పీ హైస్కూల్) చదువుతున్నారు.తామ బడికి వెళ్ళి రావడానికి రోజు చాలా దూరం నడవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి వారిద్దరికీ నూతన సైకిల్ కొన్ని ఇస్తానని మాట ఇచ్చారు అందులో భాగంగా ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సైకిలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గడపగడపలో మేము ఆడకుండానే మాకు సైకిల్ కొనిస్తామని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే తమకు నూతన సైకిల్స్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని తాము ఇంకా బాగా చదువుకుని తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటామని తెలియజేశారు.
No comments:
Post a Comment