దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతి వేడుకలు ఘనంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతి వేడుకలు మాజీ APCO,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైనది, మొదటగా స్థానిక పెండ్లి మండపం వద్ద వైయస్సార్ చిత్రపటానికీ పూలమాలవేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరము శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి యందు డాక్టర్ సతీష్, డాక్టర్ జయ గోపాల్ , *నర్స్ ఉమా గార్ల చేతులు మీదుగా ఆస్పత్రిలో ఉన్న 100 మంది రోగులకు పండ్లు, బ్రెడ్లు, సోపులు పంపిణీ చేయడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ యందు ASO ఆనంద్ గార్ల చేతులు మీదుగా ఉన్న 80 విద్యార్థులకు
కాస్మోటిక్స్ వితరణంగా అందజేశారు
ఈ సందర్భంగా మిద్దెల హరి గారు మాట్లాడుతూ
పేద బడుగు బలహీన దళిత వర్గాల ఉన్నత చదువులు చదవడానికి
ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడు దేశంలో అమలు చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం అమలు చేస్తూ ఈరోజు రైతు దినోత్సవం గా జరుపుతూ ప్రజల గుండెల్లో ఇద్దరు
చిరస్తాయిగా నిలిచారన్నారు.
పేదలకు సహాయం చేయడం వైయస్సార్ గారికి ఘన నివాళుల అర్పించనట్లే ఆయన తనయుడు యువ నేతకు ఆయన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయ దేవన్ గిరి, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గంగయ్య, న్యాయవాది రమణయ్య, మహిళా నాయకురాలు మాధవి, ముని లత, కిరణ్మయ ఎస్సీ ఫోరం గూడూరు మధు, నాగరాజు, యువసేన కార్యకర్తలు ఇసుకమట్ల బాల, గంజి వెంకటేష్,బండి రమేష్, బొజ్జ ప్రభాకర్,చల్లా సుధా చందు,చెన్నయ్య,లోకయ్య వాసు,గంజిముని,సాయి,వెంకటయ్య,బాబు,జగ్గా తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment