విజిలెన్స్ తనిఖీలు: హాస్టల్స్ నిర్వహణలో నిర్లక్షం వహిస్తే నివేదికలు
స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారైన శ్రీ శంఖ బ్రత భాగ్చి IPS ఉత్తరువుల మేరకు రాష్ట్రం అంతటా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ను విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల లో, తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన శ్రీ కె. ఈశ్వరరెడ్డి గారి పర్యవేక్షణ లో నాలుగు బృందాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలలోని వివిధ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల వసతి సౌకర్యాలు, నిర్వహణ, నిధుల వినియోగం, ఆరోగ్య, ఆహార విషయాల మీద ఆరా తీస్తున్నారు. సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి V&E అధికారి అయిన శ్రీ కె. ఈశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇక మీదట రెగ్యులర్ గా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తామని అలాగే హాస్టల్స్ నిర్వహణలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారులపై నివేదికలు పంపుతామని చెప్పారు.
No comments:
Post a Comment