శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, July 8, 2022

demo-image

శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

poornam%20copy

 శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

292492490_3231826753804985_1500072719734199849_n


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages