పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపిన న్యాయవాదులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ప్రభుత్వ వైద్యశాల మరియు బీసీ సమీకృత హాస్టల్ ను పరిశీలించిన న్యాయవాదులు.
వైద్యశాల మరియు హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు . అలాగే రోగులను మరియు హాస్టల్ విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు తెలిపారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
హాస్టల్ విద్యార్థులు మంచినీరు కొరత ఉందని తెలిపారు, వెంటనే మున్సిపల్ అధికారులకు తెలిపి త్వరలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్ మరియు మీర్జావలి,ప్రజ్ఞశ్రీ, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ పాల్గొన్నారు
No comments:
Post a Comment