‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్యత్–పవర్@2047’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు పాల్గొన్నారు.
శ్రీపవిత్ర రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు అందరికి పాధాబివందనాలు తెలియచేశారు. ఎ ఉదోగస్తులకు అయన టైం లిమిట్ ఉంటాది కానీ విద్యుత్ అధికారులు మాత్రం రాత్రి,పగలు అని తేడా లేకుండా నిరంతరం పనిచేస్తుంటారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 400 ట్రాన్స్ఫార్మర్స్,జగనన్న కాలనీ కి విద్యుత్ సర్ఫరా,8000 మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందచేయతం చాలా సంతోషంగ ఉందని తెలియచేశారు. అనంతరం నృత్య ప్రదశన చేసిన చిన్నారులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాక ఎస్.సి,డి ఈ, ఏఈ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment