మహిళలకి తాళిబోట్లా? ఉరితాళ్ళా : చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 30, 2022

మహిళలకి తాళిబోట్లా? ఉరితాళ్ళా : చక్రాల ఉష

 జగన్ మద్యపాననిషేధం అంటివి రాష్టాన్ని కల్తీ మద్యంతో ముంచిలేపుతుంటివి

మహిళలకి తాళిబోట్లా? ఉరితాళ్ళా


 స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి  :

తిరుపతి నగరంలో గాంధీ విగ్రహం ముందు తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో తెలుగుమహిళలు చేతికి మంగళసూత్రాలు ఉరితాళ్ళు పట్టుకొని మద్యపాననిషేధం ఎప్పుడు చేస్తున్నావు జగన్ అంటూ నిరసన చేపట్టారు

కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మన్నూరు సుగుణమ్మ, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ముఖ్యఅతుధులుగా విచ్చేసారు

రాష్ట్ర మహిళా కార్యదర్శి కుమారీ, పార్లమెంట్ మహిళలు భారతి, అనిత, భారతమ్మ,తిరుపతి నగర మహిళా అధ్యక్షురాలు శాంతమ్మ, రేవతి, నాయుడమ్మ, వసంతమ్మా, తరుణ,సుజాత, హేమ, లత, నీలిమ,తదితరులు పాల్గొన్నారు

సుగుణమ్మ, నరసింహ యాదవ్, చక్రాల ఉష, కుమారమ్మ మాట్లాడుతూ 

 జగన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించి మూడు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు చేయకపొ విష రసాయనాలున్న నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని,

 మహిళల తాళి బొట్లకు భద్రత కల్పిస్తానని ఆనాడు ఊరు వాడా తిరిగి  ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే విక్రయిస్తానని మాట ఇచ్చి మహిళా ఓట్లతో గెలిచి ఇప్పుడు పల్లెటూర్లో సైతం కల్తీ మద్యం ఏరులై పారుతోందని, మద్యం షాపులు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు మద్యం షాపులు పెంచుకుంటూ పోతున్నారని ఉన్న మద్యం షాపులు చాలా ఉన్నట్లుగా వాక్ ఇన్ స్టోర్ పేరుతో పట్టణాల్లో సుమారు 300 మద్యం మాల్స్ ఏర్పాటు చేశారని, జగన్ రెడ్డికి సంపద సృష్టించడం చేతకాక మద్యం ప్రియులను అడ్డంపెట్టి వాళ్ల మీదే అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి కల్తీ మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తాన్ని జలగలాగా పీల్చి తాగుతున్నారని, సిగ్గు లేకుండా మద్యంపై ఆదాయం చూపి ఇప్పటికే 58 వేల కోట్లు అప్పు తెచ్చి  అవి తీర్చలేక మద్యం అమ్మకాలు పెంచి మగవాళ్ళ జోబులు ఖాళీ చేస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడని, కమిషన్లకు కక్కుర్తి బడి ఎప్పటి నుండో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలను కాదని కొత్తగా వైసీపీ నాయకులు నాణ్యతలేని బ్రాండ్లు కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారని, సంవత్సరానికి 5000 కోట్లు చొప్పున ఐదేళ్లలో 25వేల కోట్లు దోచుకున్నారని, బెల్టు షాపులు రద్దు చేస్తాము చేసాము అని అబద్ధపు ప్రచారాలు చేసి  రాష్ట్రమంతా భారీ ఎత్తున బెల్టు షాపులు కొలువు తీరాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 లాక్ డౌన్ సమయంలో కూడా గుడులు బడువులు తెరవకపోయినా మద్యం షాపులు మాత్రం విచ్చలవిడిగా తెరిచి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు, షాపులు తెరవడమే కాకుండా 75% ధరలు పెంచి ప్రజలను పీక్కతిన్నారు, మద్యం ప్రియులు మద్యం అలవాటు మానలేక స్పిరిట్ శానిటైజర్ నాటు సారా కల్తీ మద్యం తాగి 50 మంది చనిపోగా వారి కుటుంబాలు దిక్కులేనివైనాయని, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లను సైతం క మద్యం షాపుల్లో పెట్టారని, రాష్ట్రంలో గంజాయి డ్రెస్ మాఫియా విచ్చలవిడిగాపెరిగాయని దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడిన ఆ మూలాలు ఏపీలో ఉండడం దౌర్భాగ్యం అని, ఏపీలో గంజాయి మూడు ఏళ్లలో మూడు రెట్లు పెరిగిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద గారు చెప్పారంటే మన దౌర్భాగ్యపాలన ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందని, ఈ ప్రభుత్వ తీరులో రాష్ట్రంలో మహిళలు పై గృహహింస హత్యలు అత్యాచారాలు,యాక్సిడెంట్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ 2020 -21లో మహిళపై జరిగిన నేరాలు 17 17,736 కేసులు నమోదయ్యాయి అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా అంటూ, మద్యపాన నిషేధం చేస్తానని మాట చెప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad