శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ ఆడి కృత్తిక శుభాకాంక్షలు.సుబ్రమణ్య స్వామిని నమ్ముకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఆడికృతిక శుభ సంధర్బంగా శ్రీకాళహస్తి పట్టణం విజ్ఞానగిరిపై జనసేన శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ముందుగా ఎమ్మెల్యే గారికి దేవస్థానం బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు అలాగె తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, సుబ్రమణ్య స్వామి వారిని నమ్ముకున్న వారు ఉన్నత స్థాయిలో ఉంటారని, కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదని కానీ ఈ సంవత్సరం పాలక్ మండలి చైర్మన్, దేవస్థానం EO మరియు సభ్యులందరూ బ్రహ్మోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే స్వామివారి పుష్కరిణిని శుద్ధిచేసిన యూనిక్ సంస్థకు ధన్యవాదాలు స్వామివారి నూతన ధ్వజస్తంభం కొరకు విరాళం అందజేసిన శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు.
అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పగడాల రాజు, సన్నిరు కుప్పం శేఖర్,కంఠ ఉదయ్ కుమార్,భరత్ రెడ్డి, కొల్లూరు హారి నాయుడు,శ్రీవారి సురేష్,గణేష్, మధు రెడ్డి మరియు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment