జాతీయ స్థాయిలో బీసీ హక్కుల సాధన కై 'హలో బీసీ -చలో ఢిల్లీ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, July 25, 2022

జాతీయ స్థాయిలో బీసీ హక్కుల సాధన కై 'హలో బీసీ -చలో ఢిల్లీ

 జాతీయ స్థాయిలో బీసీ హక్కుల సాధన కై 'హలో బీసీ -చలో ఢిల్లీ



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తిలోని, N. G. O భవనం నందు జాతీయ బీ.సీ సంక్షేమ సంఘం వారు హలో బీసీ-చలో ఢిల్లీ కార్యక్రమమును, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి అట్ల పురుషోత్తం గౌడరి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు జక్కాల బాలకృష్ణఅధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి జిల్లా అధ్యక్షులు తురకా అమర్నాధ్*మూడు జిల్లాల అధికార ప్రతినిధి బంగారు నారాయణస్వామిగారు మరియు పట్టణ వక్తలు మాట్లాడుతూ ఆగస్టు 2,3 తేదీల్లో, జాతీయ స్థాయిలో బీసీ హక్కుల సాధనకై *హలో బీసీ-చలో ఢిల్లీకార్యక్రమంను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. *ఆర్ కృష్ణయ్యసేవను గుర్తించి పెద్దల సభలో కూర్చోపెట్టినప్పటికీ, బీసీల కోసం తన పోరాటం తాను చేస్తూనే వుంటారు అని,అందులో భాగంగానే హలో బీసీ-చలో ఢిల్లీకార్యక్రమం చేపట్టడం జరిగిందని, అన్నారు.మేధావులు, విద్యావంతులైన మహిళలు బీసీ లలో ముందుకు వస్తున్నారని, ఇంకా కూడా మహిళ లతో పాటు,యువత ముందుకు వచ్చి రాజకీయాలలో కూడా అభివృధి సాధించాలని, నిష్కల్మషంగా బీసీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.


ఈ సందర్భంగా 

కులాల వారిగా జనగణన జరిపించాలి,

చట్ట సభల్లో బీసీ లకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలి.

మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే పాస్ చెయ్యాలి. *కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలి.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పించాలి.

మొదలగు విషయాలపై విజయం సాధించే వరకు పోరాటాలు తప్పవని అన్నారు.

అనంతరం పట్టణ సంఘం అధ్యక్షులు జక్కాల బాల క్రిష్ణ గౌడ్, గౌరవ మహిళా అధ్యక్షులు ఆర్. మ్యాగీ క్లారా,గౌరవ అధ్యక్షులు పిళ్ళారి బత్తినయ్య, గౌరవ అధ్యక్షులు మన్నెపల్లి శ్రీనివాసులు,న్యాయ సలహాదారు సీవీ మల్లికార్జునయ్య, అనేక ఉదాహరణలతో చైతన్యస్ఫూర్తి గా వారి ప్రశంగాన్ని కొనసాగించారు.

 తదనంతరం పట్టణ మరియు మండల నూతన కార్యవర్గ సభ్యులకు  నియామక పత్రాలను అందజేశారు 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నెల్లూరు గాంధీ,ఉపాధ్యక్షలు పుల్లూరు గురుబాబు, గౌరవ సలహాదారులు  పూల ముని కృష్ణయ్య, జక్కాల దుర్గాప్రసాద్, చింతా సుధాకర్, చెంచురత్నం యాదవ్, కావేరిపాకం దొరస్వామి, అన్నా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దూదేకుల మస్తాన్, మీడియా ప్రతినిధి కాట్రపల్లి చంద్రశేఖర్, కార్యనిర్వాక కార్యదర్శి డోరాల కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి పోట్లపాటి మురళి మోహన్ లతో పాటూ ప్రత్యేక ఆహ్వానితులుగా  ఏపీ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కైలాసాని సాయికుమార్, సి సి ఆర్ రాష్ట్ర ప్రతినిధి, చేనేత నాయకులు గుత్తి త్యాగరాజు మరియు సూళ్లూరుపేట అధ్యక్షులు కిషోర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మరియు బి.ఎన్. కండ్రిగ,బీసీ నాయకులు సుబ్రమణ్యం, రెడ్డి ప్రసాద్, రమణయ్య, రవి, మోహన్, సురేష్, దాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad