వరదయ్యపాలెం పాఠశాలల సమీపంలో చెత్తకుప్పలో పడేసిన కాలం చెల్లిన శీతల పానీయాలు.
ఆశపడి వాటిని సేవిస్తు అనారోగ్యం బారిన పడుతున్న అభుం శుభం తెలియని పేద విద్యార్థులు...
వరదయ్యపాలెం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సమీపంలో గల చెత్త కుప్పల్లో ఎవరో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన శీతల పానీయాల ప్యాకెట్లను పడవేసారు.
వారిని తాగడం ప్రమాదమని అనారోగ్యం అని తెలియని పేద కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు ఆ శీతల పానీయాలకు ఆశపడి వాటిని తాగుతున్నారు.
దీంతో పేద విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఇకనైనా ఇటువంటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఇక్కడ పడవేయకుండ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment