ప్రభుత్వ కార్యాలయాల్లో 15 వ రాష్ట్రపతి గౌ"శ్రీ,"ద్రౌపతి మురుము" చిత్రపటాలు అమర్చడం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ"శ్రీ, పెద్దలు సోము వీర్రాజు గారి సూచనల మేరకు, భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ గౌ" శ్రీ, "కోలా ఆనంద్ కుమార్" గారి దిశా నిర్దేశముతో....,శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు "కాసరం రమేష్" గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి..., శ్రీకాళహస్తి పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాష్ట్రపతి గౌ"శ్రీ,"ద్రౌపతి మురుము" గారి చిత్రపటాలని అందిస్తూ..., శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయం నందు భారత రాష్ట్రపతి గౌ"శ్రీ,"దౌపతి మురుము" గారికి చిత్రపటాన్ని పురపాలక శాఖ కమిషనర్ గౌ"శ్రీ, "బాలాజీ నాయక్" గారి కార్యాలయంలో "బాలాజీ నాయక్" గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి చిత్రపట్టాన్ని అమర్చడము జరిగింది,
కాసరం రమేష్ మాట్లాడుతూ, భారత ప్రధాని గౌ"శ్రీ,"నరేంద్ర మోదీ" గారు,మరియు జాతీయ పెద్దలు బలపరిచిన అభ్యర్థి గౌ" శ్రీ, "ద్రౌపది మురుము"గారు అత్యంత మెజారిటీతో పార్టీలకు అతీతంగా గెలిచిన శుభసందర్భంగా, అన్ని ప్రభుత్వ కార్యాలయంలో "ద్రౌపది మురుము"గారి చిత్రపటాన్ని అందించడము జరిగిందని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వాలు "షెడ్యూల్ ట్రైబ్" కులంకు అవకాశం ఇవ్వలేదని..., ఒక్క గౌ"శ్రీ,"నరేంద్ర మోదీ" గారు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు అని కొనియాడారు, గత రాజకీయ పార్టీలు చేయలేని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ అరుదైన గౌరవం కల్పించడంలో దోహదపడిందని, గౌ" శ్రీ,"ద్రౌపది మురుము", గారికి అరుదైన రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ...,ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకునే రీతిలో అన్ని పార్టీలు ఒక తాటిపై వచ్చి అత్యంత మెజారిటీతో గెలిపించడం చాలా ఆనందదాయమని,శుభ పరిణామమని కొనియాడడం జరిగింది,అంకితభావంతో పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఉన్నతమైన స్థానం ఉంటుందని, అది కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని పేర్కొనడం జరిగింది,
పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, ఇమ్మిడి శెట్టి మోహన్,వాసుయాదవ్, L. గోపాల్, వీరాస్వామి ఆచారి, కొండేటి గోపాల్, కోనేటి అయ్యప్ప, కటికం చందు,బాల, రాజ, రాజనాల, కిరణ్మయి, యువమోర్చ అధ్యక్షులు హరీష్,యువ మోర్చా ఉపాధ్యక్షులు సాయి,రవి,హరీష్ రెడ్డి, నాని,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment