దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

 దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు పురస్కరించుకొని







స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 శ్రీకాళహస్తినియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం నందు డు మండలం వైఎస్ఆర్సిపి నాయకుడు కలవగుంట భరత్ రెడ్డి మండలంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మండల కార్యాలయంలో  వైఎస్సార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి  పూల మాలలు వేసి  ఘన నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి,అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు .తరువాత     చీయవరం   గ్రామంలో ఇంటర్ లో అధిక మార్కులు  963/1000  సాధించిన రాజ్  విద్యార్థి ని ఘనంగా సన్మానించి  కాలేజ్ బ్యాక్  ,పార్కర్ పెన్  ,విద్యా సామాగ్రి అందజేశారు. రాంభట్ల పల్లిలో  1 తరగతి నుంచి  5వ విద్యార్థిని విద్యార్థులకు పాలకులు, విద్యాసామగ్రి, వాటర్ బాటలు  పంపిణీ చేశారు .పిల్ల మేడు  రైతులకు రాత్రుల్లలో పొలాలకు వెళ్లేందుకు  టార్చిలైట్లు పంపిణీ చేశారు .అనంతరం పుడీ, పెన్నల్లపాడు  యువకులకు వాలీబాల్ కిట్లను   అందించాడు.   అందించారు      క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ..

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు పట్టంపాడు మండలం నందు ఘనంగానిర్వహించి పలుచోట్ల సేవాకార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి జనరంజకమైన పాలన సాగించి ఆంధ్రుల హృదయాల్లో సముచిత స్థానాన్ని పొందారని.. ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.. ప్రశంసలు అందుకుంటున్నాయని అన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో  రైతే రాజుగా  ఉన్నారని అన్నారు.రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత కరెంటు, రుణమాఫీ అందించిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు .పేదలకు ఎన్నో పథకాలు  ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు అన్నారు.  వైఎస్  రాజశేఖర్ రెడ్డి జయంతి నాడే   రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారంలోకి తెచ్చి చరిత్రను సృష్టించారు. మూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. నవరత్నాలపేరిట ముఖ్యమంత్రివర్యులుజగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేడు రాష్ట్ర ప్రజలకు లబ్ధిని చేకూరుస్తున్నాయని , తండ్రి బాటలోనితాను పయనిస్తూ ప్రజాసేవయే ధ్యేయంగా ప్రజారాజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండో అధ్యక్షుడు మహదేవ రెడ్డి  ,చంద్రమౌళి రెడ్డి  ,వెంకీ  ,షబ్బీర్ భాషా ,దీపక్ రెడ్డి  ,హరి నాయుడు  ,బాల సుబ్రహ్మణ్యం  ,నరేష్  ,హరి  ,నరసింహులు  ,గోపీ  ,మనీ శేఖర్  ,రమణ  ,సుబ్రహ్మణ్యం  ,కిష్టయ్య  ,దాము   తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad