ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సిపిఎం ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఇంటింటికి సిపిఎం జనం కోసం సిపిఎం కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో పర్యటించిన సిపిఎం బృందం దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యలపై నేడు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నియోజకవర్గ ఇన్చార్జి ఏ పుల్లయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పేదల నివసిస్తున్నటువంటి కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సమస్యలు కూడా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే అక్కడున్నటువంటి స్లమ్ ఏరియాలో రాగినీటి సమస్య రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండడం తమ దృష్టికి వచ్చినట్లు తెలియజేశారు అలాగే రాజీవ్ నగర్ కైలాసగిరి కాలనీలో కూడా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు రాజీవ్ నగర్ లో 500 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారని వారికి ప్రాథమిక పాఠశాల గాని చిన్న పిల్లలకు అంగనవాడి స్కూల్స్ గాని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాగే ప్రధాన వేదిక సిమెంట్ రోడ్డు వేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సొంత మైదానంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు వారు ఉన్నటువంటి ఇండ్లకు రెగ్యులరైజ్ చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే చటకారమిట్ట కాలనీకి ఇంతవరకు సిమెంటు రోడ్డు మంజూరు చేయలేదని తెలిపారు చెంచులక్ష్మి కాలనీ నందు నివాసముంటున్న గిరిజనులకు సైడ్ కాలువలు అదేవిధంగా పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారని వర్షం వస్తే వర్షపు నీరంతా ఇండ్లలోకి వచ్చే విధంగా ఉన్నాయని వర్షపు నీరంతా బయట వెళ్ళడానికి కల్వర్టు కట్టి తగిన ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయాలని కోరారు నాలుగవ వార్డు సున్నపారిజన వాడ కాలనీలో కన్నలి కాలవ మురుకు నీళ్లలో పూడిక తీయకుండా వదిలేసి ఉండడం వల్ల ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారని తెలిపారు అక్కడ చిన్న బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ప్రక్కనే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను మార్పు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు 18 వ వార్డు దేవరమెట్ట కాలనీవాసులను ఎస్టీలుగా గుర్తించి వారికి శాశ్వత ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు ప్రాజెక్టు వీధి st కాలనీ వాసులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అధికారులు గిరిజనులను కరెంటు బిల్లులు కట్టడానికి వేధిస్తున్నారని తెలిపారు 28 వార్డు కాలనీవాసులకు ఇంటి పట్టాలు ఓటి ఎస్ నుంచి మినహాయించి వారికి ఉచితంగా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు పేదల నివాసం ఉంటున్నఈ కాలనీ ల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వాటి పరిష్కారా నికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గంధం మని గురవయ్య రాజా వెలివేంద్రం మధు మునెమ్మ బత్తయ్య సురేష్ నిర్మల మాధవి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment