త్వ‌ర‌లో తిరుప‌తిలో ఎస్ఎస్‌డి టోకెన్లు : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, July 10, 2022

త్వ‌ర‌లో తిరుప‌తిలో ఎస్ఎస్‌డి టోకెన్లు : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

 త్వ‌ర‌లో తిరుప‌తిలో ఎస్ఎస్‌డి టోకెన్లు : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి



టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం చ‌ర్చించిన త‌రువాత తిరుప‌తిలో ఎస్ఎస్‌డి టోకెన్లు పునః ప్రారంభించ‌నున్న‌ట్లు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. జనార్ధన రావు , అనిల్ కుమార్ – హైదరాబాద్, వేణు – రాజ‌న్న సిరిసిల్ల , రాంబాబు – హైద‌రాబాద్‌
ప్రశ్న – శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరకడం లేదు ?
ఈవో – జూలై 7వ తేదీ సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదలచేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోండి.
2. శేషాద్రి – ఒంగోలు
ప్రశ్న – తిరుమలలో వసతి కొరకు రూ.1000/- కాష‌న్ డిపాజిట్ చెల్లించాము. ఇంతవరకు మా అకౌంట్లో జమ కాలేదు ?
ఈవో – కాషన్ డిపాజిట్ 12 గంటల్లోపు టీటీడీ నుండి ఫెడరల్ బ్యాంక్‌కు చేరుతుంది. అక్కడి నుండి మీ అకౌంట్ కలిగిన బ్యాంక్‌కు రెండు రోజుల్లో జ‌మ చేయ‌బ‌డుతుంది.
3. పద్మ – జడ్చర్ల
ప్రశ్న – 60 సంవత్సరాలు పైబడిన వారికి వయోవృద్ధులకు ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు పొందే సౌకర్యం బాగుంది ?
ఈవో – ధన్యవాదాలు
4. లలిత – విశాఖపట్నం, శివ‌య్య – అనంత‌పురం
ప్రశ్న – సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో గదులు దొరకడం లేదు ?
ఈవో – తిరుమలలో 7 వేల గదులు మాత్రమే ఉన్నాయి. 20 వేల మందికి మాత్రమే వసతి కల్పించగలము. 50% గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ కింద, మిగిలినవి నేరుగా వచ్చి పేర్లు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కేటాయిస్తున్నాము. కావున తిరుమలలో వసతి కొరకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవలెను.
5. సంధ్య – హైదరాబాద్
ప్రశ్న – టీటీడీ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందించాము. ఇంతవరకు విరాళంకు సంబంధించిన డోనార్ పాస్ బుక్ అందలేదు?
ఈవో – టిటిడి అధికారులు మిమ్మల్ని సంప్రదించి దాత‌ల‌కు అందించే పాస్‌బుక్‌, సౌకర్యాలు అందిస్తారు.
6. గణేష్ – ఖ‌మ్మం
ప్రశ్న – టీటీడీ యాప్‌లో ద‌ర్శ‌నం టిక్కెట్లు బుక్ కావడం లేదు?
ఈవో – ఇటీవల జియో సంస్థ వారితో టీటీడీ అవగాహన ఒప్పందం చేసుకుంది. త్వరలోనే నూతన యాప్ భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చి, ఆన్‌లైన్‌ దర్శనాలు, సేవ టికెట్లు, వసతి బుక్ చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం.
7. సౌందర్య బెంగళూరు
ప్రశ్న – తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు చాలా బాగుంది, కానీ చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఉన్నాయి ?
ఈవో – ఇప్ప‌టికే 100 శాతం ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు బ్యాన్ చేశాం, ద‌శ‌ల‌వారిగా అమ‌లు చేస్తున్నాం. తిరుమ‌ల‌లోని దుకాణ దారులకు అవ‌గాహ‌ణ క‌ల్పించి పూర్తిగా ప్లాస్టిక్ వాడ‌కాన్ని నిషేధించాం.
8. రాధాకృష్ణ – తమిళనాడు
ప్ర‌శ్న – శ్రీవారి సేవ చేయాలని ఉంది, ఎలా బుక్ చేసుకోవాలి ?
ఈవో – ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని శ్రీవారి సేవకు రండి.
9. లావణ్య – విశాఖపట్నం
ప్ర‌శ్న – మేము వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్లు తీసుకున్నాము, మాకు కండువా, జాకెట్టు ఇవ్వలేదు ?
ఈవో – వర్చువల్ సేవ టికెట్లు పొందిన భక్తులు 90 రోజుల్లోపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పించింది. మీరు తిరుమలకు వచ్చినప్పుడు నేరుగా మీ టికెట్ చూపి కండువా జాకెట్టు పొంద‌వచ్చు.
10. జగన్మోహన్ – ఖమ్మం
ప్ర‌శ్న – తిరుమలలో చెప్పుల స్టాండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. భక్తులు చెప్పులు ఎక్కడపడితే అక్కడ వదిలి వేస్తున్నారు, సరైన చర్యలు తీసుకోండి ?
ఈవో – భక్తుల సౌకర్యార్థం లగేజీ మాదిరిగానే చెప్పులు కూడా తీసుకునేలా చర్యలు తీసుకోనున్నాం.
11. ఈశ్వరయ్య – రాజంపేట
ప్ర‌శ్న – మా గ్రామంలో రాములవారి ఆలయం నిర్మిస్తున్నాం. అందుకు అవసరమైన రాతి విగ్రహాల కోసం టీటీడీ సాధారణ విభాగము, శిల్పకళాశాల కు వెళ్లిన సరైన సమాధానం ఇవ్వడం లేదు ?
ఈవో – మా అధికారులు మీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు.
12. వీరన్న – ఆదోని
ప్ర‌శ్న – ఆదోని టిటిడి కళ్యాణమండపంలో బాడుగ నిబంధనల మేరకు తీసుకున్న, ఇతర ఏర్పాట్లకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు?
ఈవో – కళ్యాణమండపంలో టీటీడీ నిర్ణయించిన మెరకే రుసుము చెల్లించాలి. అలాకాక‌ నిబంధ‌న‌లు ఉల్లంగిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. మిగిలిన భోజ‌నాలు, డెక‌రేష‌న్ త‌దిత‌ర అంశాలు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. టీటీడీకి సంబంధం లేదు.
13. వెంకటసుబ్బమ్మ – హైదరాబాద్
ప్ర‌శ్న – వృద్ధుల మైన మాకు కంటి చూపు తగ్గడం వలన స్వామివారి లఘు దర్శనం కల్పించగలరు?
ఈవో – తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గ‌న‌నీయంగా పెరిగింది. ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నాము. దాదాపు 20 నుంచి 30 గంటల పాటు భ‌క్తులు క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. కావున లఘు దర్శనం కల్పించడం వీలు కాదు.
14. ప్రకాష్ – జగిత్యాల
ప్ర‌శ్న – తిరుమల నడక మార్గంలో దర్శన టోకెన్లు పునః ప్రారంభిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది?
ఈవో – తిరుపతిలో దివ్య‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించి అమలు చేస్తాం. వేస‌వి ర‌ద్దీ త‌గ్గిన త‌రువాత ఈ టోకెన్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం.
15. ప్రకాష్ – నగరి
ప్ర‌శ్న – తిరుమలలో టైం స్లాట్ దర్శనము పునః ప్రారంభించాలి. శ్రీవారి లడ్డు నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. కొండపై పచ్చదనం తగ్గిపోతొంది ?
ఈవో – ఎస్ఎస్‌డి సర్వదర్శనం ఆన్‌లైన్‌ టికెట్లు త్వరలో ప్రవేశపెట్టెందుకు టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. తద్వారా భక్తుల కేటాయించిన సమయంలో సులభంగా శ్రీ‌వారిని దర్శించుకోవ‌చ్చు.
శ్రీవారి లడ్డు మరింత రుచికరంగా ఉండేందుకు సేంద్రియ వ్యవసాయంతో పండించిన ముడి ప‌దార్థాలు వినియోగించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే 500 క్వింటాళ్ల వేరు సెనగలు, ఇతర ముడి పదార్థాలను టిటిడి కొనుగోలు చేసింది. తిరుమలలో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad