విలేకరుల సంక్షేమం కోసం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కృషి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
విలేకర్ల వ్యక్తిగత భద్రత వారి కుటుంబానికి రక్షణ కోసం అవసరమైన సంక్షేమం కోసం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని విలేకరులందరూ సమిష్టిగా స్పష్టం చేశారు . ప్రెస్ క్లబ్ లోనే సంక్షేమ సంఘం ఉంటుందని ఈ సంఘం ద్వారా ప్రతి ఒక్క పాత్రికేయునికి , వారి కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పాత్రికేయుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేస్తూ సభ తీర్మానించింది. మదనపల్లి ఆంధ్రప్రభ విలేకరి వెంకటసేవపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లాలో చిత్తూరు శ్రీకాళహస్తిలో కూడా పాత్రికేయుల పై దాడులు జరగడం దురదృష్టకరమని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. విలేకరులపై దాడులను సభ ముక్తకంఠంతో ఖండించింది. విలేకరుల సంక్షేమ సంఘం ద్వారా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కూడా సభలో రూపొందించారు. విలేకర్ల సంక్షేమనిధికి తమ వంతుగా మునికృష్ణారెడ్డి 2000, ఆంధ్రప్రభ సీనియర్ పాత్రికేయులు బొమ్మినేటి హరిబాబుయాదవ్ 1000, విశాలాంధ్ర ఇన్చార్జి కోటేశ్వరబాబు 1000, మీసేవ సూరి రు.1000, ఆంధ్రప్రభ శ్రీకాళహస్తీశ్వరాలయ రిపోర్టర్ ,జనార్దన్ రెడ్డి 500,యాసిన్ గారు 200, పేట శేఖర్ 2000 లుఅందజేశారు. త్వరలోనే సంక్షేమ నిధి మరింత సమీకరించి పాత్రికేయుల అభ్యున్నతి కోసం సంఘం కృషి చేస్తుందని పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment