మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి: కార్మిక సంఘం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
* హెల్త్ అలెవెన్స్ బకాయి తో సహా చెల్లించాలి
* పట్టణ విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్య పెంచాలి*
* రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడివిటీ పెన్షన్ చెల్లించాలి
* మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
మున్సిపాలిటీ కార్మికుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరీక్షరించాలని కోరుతూ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఏఇటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న మునిసిపాలిటీ కార్మికులకు తాను ముఖ్యమంత్రి అయితే పర్మినెంట్ చేస్తానని మాటిచ్చి కార్మికుల నుంచి ఓట్లు వేపించుకొని ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పుడు వరకు కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కార్మికులకు ఇవ్వవలసిన వేతనాలను కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. 11వ వేతన సవరణ సంఘం ప్రతిపాదించిన 20000 రూపాయల జీతము మరియు కరువు భత్యం చెల్లించాల్సి ఉండగా 15వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అన్నారు. దీనివల్ల కార్మికులు ప్రతినెల 9000 రూపాయలు నష్టపోతున్నారు. కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కూడా సక్రమంగా అందడం లేదు. రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు అన్నారు. ప్రతి చిన్న సమస్యను పరిష్కారానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించాలి లేకపోతే పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె చేస్తామని అన్నారు.
No comments:
Post a Comment