స్విమ్స్ అభివృద్ధి లో మీ పాత్రా కీలకం – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 28, 2022

స్విమ్స్ అభివృద్ధి లో మీ పాత్రా కీలకం – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

 స్విమ్స్ అభివృద్ధి లో మీ పాత్రా కీలకం – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి








స్విమ్స్ ఆసుపత్రిని దేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా తయారుచేయడంలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్యోగుల పాత్ర కూడా అంతే ముఖ్యమని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అన్నారు.
స్విమ్స్ ఆస్పత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఆయన పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్యోగులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రోగికి సంతృప్తి కరమైన వైద్యం అందాలన్నా, త్వరగా కోలుకోవాలన్నా డాక్టర్లు ఎంత ముఖ్యమో, పారామెడికల్, ఇతర ఉద్యోగులు కూడా అంతే ముఖ్యమన్నారు. ఆస్పత్రిలో ఎంతో అనుభవం సాధించిన వీరంతా ప్రజల్లో స్విమ్స్ పట్ల మరింత విశ్వాసాన్ని పెంచడానికి కృషి చేయాలని ఆయన కోరారు. టీటీడీ లో పనిచేస్తున్న 8500 మంది ఉద్యోగులు, సుమారు 9 వేల మంది పెన్షనర్లు వైద్యం కోసం స్విమ్స్ కే రావాలనే వాతావరణం కల్పించాలని ఆయన కోరారు.
స్విమ్స్ లో అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉన్న డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని చెప్పారు. స్విమ్స్ కు అవసరమైనంత మంది సిబ్బంది, మిషనరీ, ఇతర సదుపాయాలు టీటీడీ కల్పిస్తుందన్నారు. రోగులను తమ సొంత బిడ్డలుగా భావించి నిబద్ధతతో సేవలు అందిస్తే, డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే వారిని ఇక్కడకు రప్పించవచ్చని ఈవో వివరించారు. డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందే రోగులకోసం 30 ప్రత్యేక రూములు ప్రారంభించామని, నెల రోజుల్లో మరో 60 గదులు సిద్ధం అవుతాయన్నారు. స్విమ్స్ లో వైద్య సేవలు బాగానే ఉన్నా, ఆసుపత్రికి ఆశించిన స్థాయి రావడం లేదని చెప్పారు.
రాబోయే రోజుల్లో రోగులు చెన్నై లాంటి నగరాలకు కాకుండా, స్విమ్స్ కు వచ్చే పరిస్థితులు రావాలన్నారు. ఆసుపత్రి కోసం రూ 5 కోట్లతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయిస్తున్నామని శ్రీ ధర్మారెడ్డి తెలిపారు. ఆగస్టు చివరికి ఇది ఉపయోగంలోకి వస్తుందన్నారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎ సిఎవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad