మానవ అక్రమ రవాణా చట్ట రీత్యా నేరం-డిఎస్పీ విశ్వనాధ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ బాలల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా చైల్డ్ రైట్స్ అండ్ యు (క్రై) సహకారంతో ప్రగతి సంస్థ ఆద్వర్యంలో తొట్టంబేడు బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన అవగాహనా సమావేశం లో శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాధ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, బాలల అక్రమ రవాణా అనేది తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, అపహరణ, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ మరియు పిల్లలపై ఇతర నేరాల వంటి సమస్యలతో ముడిపడి ఉన్న అంశం, దీనిని అరికట్టవలసిన బాద్యత అందరిదీ అని తెలిపారు. ప్రగతి సంస్థ వారు బాల్య వివాహాల నిర్మూలనలో ఎంతో కృషి చేశారని, అలాగే సామాజిక సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తున్నారని ఈ సందర్బంగా వారి యొక్క సేవలు అభినందనీయమని తెలిపారు. శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మొబైలు ఫోనుల వాడకంతో సులువుగా అమ్మాయిలను మోసం చేస్తూఉన్నారు, అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఏదయినా సమస్య వచ్చినపుడు 100 లేక 1098 కు కాల్ చేసి సమస్యను తెలియచేసిన ఎడల వెంటనే స్పందించి వారిని సమస్య నుండి రక్షించడం జరుగుతుందని తెలిపారు. దిశ యాప్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రగతి డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ జాతీయ నేర నివేదిక సంస్థ యొక్క 2020 సంవత్సరం నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 171 అక్రమ రవాణా కేసులతో దేశంలో 3వ స్థానంలో ఉంది. ఆ నివేదిక ప్రకారం 2019 సంవత్సరంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ కేసులు నమోదు అయినవని, మానవ అక్రమరవాణా గురించి గ్రామాలలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలననే ఉద్దేశ్యంతో ప్రగతి సంస్థ పాఠశాలలలో మరియు గ్రామాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, ప్రగతి కోఆర్డినేటర్ తులసీరాం రెడ్డి, మండల కోఆర్డినేటర్ ప్రభాకర్, శివా రెడ్డి, ప్రభాకర్ నాయుడు, చందమామల కోటయ్య, అద్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment