శ్రీకాళహస్తి పట్టణ MRO ఆఫీస్ వద్ద విన్నుత్న తరహలో "చౌక దుకాణ సమగ్రితో " ప్రదర్శనగా...,నిరసన, ధర్నా...,
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు,గౌ"శ్రీ, "సోము వీర్రాజు" గారి పిలుపుమేరకు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు గౌ"శ్రీ,"సన్నారెడ్డి దయాకర్ రెడ్డి" గారి దిశానిర్దేశంతో...., భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ గౌ" శ్రీ,"కోలా ఆనంద్ కుమార్" గారి సూచనల మేరకు.... భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ మరియు కునాటి నాగరాజు గార్ల ఆద్వర్యంలో "చౌక దుకాణం సామాగ్రితో" ప్రదర్శనగా శ్రీకాళహస్తి పట్టణం తహసిల్దారు వారి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది,
కాసరం రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధాన మంత్రి "గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" క్రీంద లబ్ధిదారులకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని లబ్దిదారులకు గడిచిన 4 నేలలుగా పంపిణీ చేయని YCP ప్రభుత్వం పై నిరంకుశ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 5,500 కోట్లతో 2022 మార్చి నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి పేదవాడికి అందించాలని, ఈ ప్రక్రియను 2022 సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా ఉచిత బియ్యాన్ని పేదవాడికి ఇవ్వడంలో వైఫల్యం చెందిందని, పేదవాడికి పట్టడం అన్నం కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని,కేంద్రం విడుదల చేసినటువంటి బియ్యాన్ని త్వరతిగతిగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ జరగాలని, వినూత్న తరహాలో ప్రదర్శనగా..., ధర్నా చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పేదవాడికి రేషన్ బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని,అట్లు పంపిణీ చేయని యెడల రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పేదల పక్షాన నిలబడి కేంద్ర అంధిస్తున్న సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయిలో తీసుకుపోతామని హెచ్చరించడం జరిగింది,
పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్,శ్రీకాళహస్తి మండల పార్టీ అధ్యక్షులు కూనాటి నాగరాజు, సీనియర్ నాయకులు కిట్టు, వాసుయాదవ్, ఢిల్లీ బాబు, కన్న వెంకటేశ్వర్లు, ధర్మయ్య యాదవ్, L.గోపాల్, వీరస్వామి ఆచారి, కొండేటి గోపాల్, కొనేటి అయ్యప్ప, కటికం చందు, శ్రీధర్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు హరీష్, యువ మోర్చా ఉపాధ్యక్షులు సాయి, యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి భరత్ నాయుడు,గోపాల్,బాల, ఖాదర్,రియాజ్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment