తిరుపతిలో సి.జి.హెచ్.ఎస్ వెల్‌నెస్ సెంటర్ మంజూరు కోసం కేంద్ర మంత్రిని కలిసిన తిరుపతి ఎంపీ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, July 20, 2022

తిరుపతిలో సి.జి.హెచ్.ఎస్ వెల్‌నెస్ సెంటర్ మంజూరు కోసం కేంద్ర మంత్రిని కలిసిన తిరుపతి ఎంపీ

 తిరుపతిలో సి.జి.హెచ్.ఎస్ వెల్‌నెస్ సెంటర్ మంజూరు కోసం కేంద్ర మంత్రిని కలిసిన తిరుపతి ఎంపీ



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం విజయవాడ, నెల్లూరు, విశాఖ పట్టణం మరియు గుంటూరు కి మాత్రమే పరిమితమైన సి.జి.హెచ్.ఎస్ వెల్ నెస్ సెంటర్ లు రాయలసీమ జిల్లాలకు కేంద్ర బిందువైన మరియు కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాకి మంజూరు చేయవలసినదిగా ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  మన్సుఖ్ మాండవీయ గారిని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్, బ్యాంకింగ్, ఆర్ఎంఎస్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయ పన్ను, కేంద్రీయ విద్యాలయ, అల్ ఇండియా రేడియో, దూరదర్శన్, సెంట్రల్ ఇంటిలిజెన్స్, సెంట్రల్  వేర్ హౌస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సైన్స్ సెంటర్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, వేద విశ్వవిద్యాలయం ఇలా పలు సంస్థలు ఉన్నాయని అలాగే పొరుగు జిల్లాలైన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల లో కూడా పలు సంస్థలు ఉన్నాయని కానీ ఎక్కడ సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ లేదని ఆయనకి వివరించారు.


ముఖ్యంగా సి.జి.హెచ్.ఎస్ వెల్ నెస్ సెంటర్ వలన కేంద్ర ప్రభుత్వ మరియు ఎంప్యానెల్ సౌకర్యాలలో నమోదు చేసుకున్న సభ్యులందరికీ ఇన్‌పేషెంట్ చికిత్స, ఎంపానెల్డ్ హాస్పిటల్స్ మరియు డయాగ్నస్టిక్ సెంటర్లలో నగదు రహిత చికిత్స, ప్రభుత్వ లేదా ఎంప్యానెల్ డయాగ్నస్టిక్ సెంటర్లలో వైద్య పరిశోధనలు నిర్వహించబడతాయని ఔషధాల ఖర్చులతో సహా ఔట్ పేషెంట్ చికిత్స, పాలీక్లినిక్ లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో నిపుణుల సంప్రదింపులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో చేపట్టిన అత్యవసర వైద్య చికిత్సల రీయింబర్స్‌మెంట్, ప్రసూతి, పిల్లల ఆరోగ్య సేవలు మరియు కుటుంబ సంక్షేమానికి సంబంధించిన ఖర్చులు, వినికిడి పరికరాలు, ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు వంటి బాహ్య వైద్య ఉపకరణాల కోసం అయ్యే ఖర్చులు, ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ మరియు యునాని వంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు వంటి సేవలన్నీ కూడా సులభతరమవుతాయని ఆయన చెప్పారు.


అలాగే దాదాపు 15 వేల మంది కేంద్ర ప్రభుత్వ సంస్థాగత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు పదవీ విరమణ పొందినవారు ఉన్నారని వారికీ సరైన వైద్యం మరియు రిఫరల్ సౌకర్యాలను పొందేందుకు సి.జి.హెచ్.ఎస్ వెల్‌నెస్ సెంటర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయనకి చెప్పారు. 


తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ప్రపంచం నలుమూలల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వేల సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారని అనువలన వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని తిరుపతిలో సి.జి.హెచ్.ఎస్ వెల్‌నెస్ సెంటర్ ద్వారా వైద్య సహాయం అవసరం ఎంతైనా ఉందని ఆయనకి వివరించారు. సావధానంగా విన్న మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారని మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకొంటామని తెలియజేసారని ఎంపీ గురుమూర్తి గారు చెప్పారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad