ఎస్ వి సంగీతం కాలేజ్ విద్యార్థుల నాట్యంతో పులకరించిన శ్రీ స్వామి వారి సన్నిధి
స్వర్ణముఖి న్యూస్,తిరుమల :
కలియుగ దేవుడైన తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న నాదనీరాజనంలో శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల వారి ఆధ్వర్యంలో గురువు రవి సుబ్రహ్మణ్యం, శాంతిలక్ష్మి సారధ్యంలో చిన్నారులు భరతనాట్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు అశేష భక్తజనం పాల్గొని కన్నులారా తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వాస్తవ్యులు హర్షిత సూర్య కుమార్ నాట్యం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం పాల్గొని చిన్నారి భరతనాట్యాన్ని తిలకించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ,సీత స్వయంవరం... మొదలైన పాటలకు చిన్నారుల నృత్యంను భక్తులని ఎంతో ఆకర్షించింది.చిన్నారి నాట్య హవాబాహవాలతో భక్తులను భక్తపరవసమ్ములో ముంచారు.
No comments:
Post a Comment