అన్ని శాఖ అధికారులు, అన్ని బ్యాంక్ అధికారులు, పారా లీగల్ వాలంటరీ లకు జాతీయ లోక్ అదాలత్ పై అవగాహన కల్పిస్తూ... ఆగస్టు 13వ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో అన్ని శాఖ అధికారులు, అన్ని బ్యాంక్ అధికారులు, పోలీస్ ఉన్నత అధికారులు, పారా లీగల్ వాలంటరీ లకు రాబోయే ఆగస్టు 13 వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర మరియు అన్ని శాఖ అధికారులు, అన్ని బ్యాంక్ అధికారులు, పోలీస్ ఉన్నత అధికారులు, పారా లీగల్ వాలంటరీ లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.... రాబోయే ఆగస్టు 13 వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఎలాంటి కేసులు లోక్ అదాలత్ లో జరుగుతాయి, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన అందించారు. మరియు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే పారాలీగల్ వాలంటరీ లు న్యాయానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని, ప్రజలకు న్యాయ అవగాహన కల్పించాలని తెలిపారు. మరియు న్యాయ పరమైన సందేహాలు, సలహాల కొరకు 15100 కు ఫోన్ చేస్తే ఉచితము అందిస్తారు అని తెలిపారు
No comments:
Post a Comment