వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 28, 2022

వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్





సెప్టెంబర్ నెల 27 నుండి అక్టోబరు 5 వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్, టిటిడి సి వి & ఎస్ ఓ శ్రీ నరసింహ కిషోర్ గారితో కలిసి మంగళవారం నాడు నాలుగు మాడ వీధులలో పర్యటించి భద్రత ఏర్పాట్లకు అవసరమైన మరియు తీసుకోవలసిన చర్యలను సమీక్షించారు
కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను యధావిధిగా సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. రెండు సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవాలకి హాజరు కాలేక నిరుత్సాహంతో ఉన్న స్వామి వారి భక్తులు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రత ఏర్పాట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎస్పీ గారు నాలుగు మాడా వీధులలో పర్యటించారు.
మంగళవారం మాడా వీధులలో ఆయన పర్యటిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిన ప్రాంతాలను గుర్తిస్తూ, భక్తుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీస్ లలో వాహన సేవలు అనంతరం భక్తులు బయటకు వెళ్లే మార్గాలలో తొక్కిసలాటలు వంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై టిటిడి విజిలెన్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులతో పాటు పోలీస్ అధికారులతో ఆయన చర్చించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి భక్తులైన ప్రతి ఒక్కరూ ఆత్రుతతో ఎదురుచూసే మహత్తర కార్యక్రమం.
తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా, వైకుంఠం భువికి దిగిందా అన్న చందంగా జరిగే బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్న దృఢ సంకల్పంతో ఎస్పీ గారు భద్రత ఏర్పాట్లపై మాడా వీధుల్లో పర్యవేక్షించారు.
టీటీడీ సివి & ఎస్ ఓతో కలిసి ఏర్పాట్లు తీసుకోవలసిన అవసరమైన చర్యలపై సమీక్షించారు.
అనంతరం తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసు అధికారులు మరియు టీటీడీ విజిలెన్స్ అధికారులు లతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర్ రెడ్డి ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా జరగడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత పోలీసులైన ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న బ్రహ్మోత్సవాలను భద్రతాపరంగా విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసు అధికారులు సిబ్బంది భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ దూరప్రాంతాల నుంచి స్వామి వారి సేవలను వీక్షించడానికి ఆత్రుతతో తిరుమలకు చేరే భక్తులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు
బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పించాల్సిందిగా అందుకు తగిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వాహన సేవలో అనంతరం భక్తులు నాలుగు మాడవీధుల నుంచి వెలుపలకు రావడానికి సురక్షిత వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిట్ మార్గాల వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం కూడా భగవంతుడు పోలీసు విభాగానికి ఇచ్చిన ఒక వరంగా భావించాలని, పవిత్ర బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని తిలకించడానికి వచ్చే లక్షలాది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించడం స్వామి సేవలో భాగమేనని ఆయన తెలిపారు.
స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా విజిలెన్స్ వారితో కూడా సమన్వయం చేసుకుంటూ భద్రతను పటిష్ట పరచాలని జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి యస్ గారు సూచించారు
ఈ కార్యక్రమంలో తిరుమల అడిషనల్ ఎస్పి శ్రీ ముని రామయ్య, డీఎస్పీ వేణుగోపాల్, సిఐ జగన్ మోహన్ రెడ్డి, టీటీడి విజిలెన్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad