భూమి పూజకు పెద్దిరెడ్డికి ఆహ్వానం : ఎమ్మెల్యే ఆదిమూలం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, April 22, 2023

భూమి పూజకు పెద్దిరెడ్డికి ఆహ్వానం : ఎమ్మెల్యే ఆదిమూలం

 టీటీడీ కల్యాణ మండపం భూమి పూజకు రండి


 స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి   :


 మంత్రి పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే ఆదిమూలం ఆహ్వానం

 కలెక్టర్, జేసీ, ఎస్పీ లకూ ఆహ్వానం

ఈ నెల 27న సత్యవేడు లో టీటీడీ కల్యాణ మండపంకు భూమిపూజ

సత్యవేడు లో నిర్మించనున్న టిటిడి కల్యాణ మండపం భూమి పూజకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆహ్వానించారు. శనివారం తిరుపతి లోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే చేరుకొని ఈ మేరకు ఆహ్వానం పలికారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ కోరిక మేరకు సత్యవేడు దేవస్థానం కల్యాణ మండపం నిర్మించడానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి అంగీకరించి మంజూరు చేశారన్నారు. కల్యాణ మండపం మంజూరు చేసిన వైవీ సుబ్బా రెడ్డి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 27న మధ్యాహ్నం సత్యవేడు బేరి శెట్టి కల్యాణ మండపం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో టీటీడీ కల్యాణ మండపంకు భూమిపూజకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి లను భూమి పూజకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అందరు పాల్గోని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad