స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా పంచభూత లింగాలలో వాయు లింగేశ్వరుడు గా శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శివయ్య బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది రేపటి నుంచి శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. భగవంతుని కన్నా భక్తునికే తొలి ప్రాధాన్యత నిస్తూ భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రేపు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించనున్నారు అర్చకులు సకల దేవతలను ముక్కంటి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరనున్నారు.. . పామరునిగా ఆటవిక్కునుగా జీవనం సాగిస్తూ తన అచంచలమైన కల్మషం లేని భక్తితో ముక్కంటిని కొలిచాడు కన్నప్ప.. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్ని సైతం పరమేశ్వరుడు మహా ప్రసాదంగా స్వీకరించాడంటే కన్నప్ప భక్తి ప్రపత్తులు ఎంతటి ఉన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు..శివయ్య కంట్లో కన్నీరు చూడలేక తన కళ్ళనే దానం చేసి ధన్యుడయ్యాడు. ఆ శివయ్య లోనే ఐక్యమయి మోక్ష ప్రాప్తి పొందాడు. అలాగే మానవులే కాకుండా మూగజీవాలు కూడా ముక్కంటి సేవలో తరించిన పుణ్యస్థలం శ్రీకాళహస్తి. సాలెపురుగు పాము ఏనుగు ఈ మూడు మూగజీవాలు తమ భక్తితో పరమేశ్వరుని తమదైన రీతిలో అర్చంచాయి. భక్తి పారవశ్యంలో తమలో తామే కలయించుకొని ముక్తి పొందాయి . అలా మూడు మూగజీవాల పేర్లతో శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడిందంటే వాటి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది ఇలా భక్తికి పండితుడు పామరుడు అన్న తేడాలు ఉండవని పేద ధనిక వేదాలు ఉండవని చాటిచెప్పిన పవిత్ర భూమి శ్రీకాళహస్తి క్షేత్రం.. అంతేకాదు పంచభూత లింగాల లో నాలుగు తమిళనాడులో ఉంటే ఏపీలో శ్రీకాళహస్తిలో ఐదవ లింగమైన వాయు లింగేశ్వరుడు గా భక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నాడు పార్వతీపతి.. ఇక రాహు కేత దోషాలు పారదోలే క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అందుకనే మన దేశం నుంచే కాకుండా విదేశీయులు సైతం నిత్యం శ్రీకాళహస్తికి చేరుకొని దోష నివారణ పూజలు చేసుకుంటారు.. గర్భాలయంలో వాయు లింగేశ్వరుని లింగం నుంచి ఉత్సవాస నిత్వాసములు వస్తుండడంతో అక్కడే ఉన్న దీపం రెపరెపలాండటం మహిమాన్విత అంశంగా చెప్పుకోవచ్చు.. శివలింగానికి నవగ్రహ కవచం ఉండడంతో ఎలాంటి దోషాలు అంటని ఏకైక ఆలయంగా కూడా గుర్తింపు ఉంది. అందుకే సూర్యచంద్ర గ్రహణాల లో సైతం యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉండడం విశేషం ఇంతటి మహిమాన్వితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇల కైలాసాన్ని తలపిస్తూ ఉంటాయి..
ఇక ఈ ఏడాది జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాదిమంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూలైన్లో విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రోటోకాల్ విఐపి భక్తులకు, సామాన్య భక్తులకు విడిగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా సామాన్య భక్తులకు త్వరితగతి న దర్శనం అయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు అలాగే ఆలయంలో అలంకరణ భక్తులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పూలను పండ్లతో ఆలయం అలంకరించారు.. కళ్ళు జిగేలుమనిపించేలా విద్యుత్ దీప కాంతులతో శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలను నింపేశారు అలాగే స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.. ఇక ఉత్సవాల రోజువారి వివరాలకు వస్తే ఈనెల3న భక్తకన్నప్ప ధ్వజారోహణం అనంతరం, 4నశ్రీకాళహస్తీ శ్వరస్వామి ధ్వజారోహణం, 5న 2వ తిరునాళ్లు,
6న మూడవ తిరునాళ్లు, 7న నాలుగవ తిరునాళ్లు, 8నమహాశివరాత్రి, 9 ఉదయం రథోత్సవం, రాత్రితెప్పోత్సవం, 10న ఆది దంపతుల కల్యాణం,11న సభాపతికల్యాణం, 12న కైలాసగిరి ప్రదక్షిణ, 13న ధ్వజావరోహణం,
14న పల్లకీసేవ, 15న ఏకాంతసేవ, 16న శాంతి అభిషేకంనిర్వహించనున్నారు.
No comments:
Post a Comment