కవికి మరణం లేదు.... లగడపాటి భాస్కర్ గారు సుమారు 66 పుస్తకాల్లో నిత్యం జీవిస్తున్నాడని తెలిపిన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలో ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళావేదిక వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు లగడపాటి భాస్కర్ గారి సంస్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూర శ్రీనివాసులు, విశ్రాంతి ఉద్యోగులు స్వర్ణమూర్తి, మోహన్ కుమార్, అన్నపూర్ణ,, రవీంద్ర ,జైచంద్ర, గణేష్, గురునాథం, అన్వర్ భాష, నాగమణి ,బికుప్పం ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య మరియు మొదలైన కవులు, రచయితలు మరియు భాస్కర్ గారి అభిమానులు పాల్గొన్నారు.
దేవస్థాన చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు మాట్లాడుతూ .... తెలుగు సాహితీ లోకానికి తీరనిలోటు
మా గురువైన లగడపాటి భాస్కర్ గారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతులు తెలిపారు అలాగే విద్వాన్ ,ప్రముఖ కవి లగడపాటి భాస్కర్ గారు శ్రీకాళహస్తి దేవస్థానం పై అనేక పుస్తకాలు రచించారు . త్వరలో ఆయన రచించిన శ్రీకాళహస్తి మహత్యం పుస్తకం ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఆయన రచించిన సుమారు 66 పుస్తకాలు ఉన్నంతవరకు మన మధ్య భాస్కర్ గారి ఎప్పుడూ ఉంటారని తెలిపారు.
లగడపాటి భాస్కర్ గారి గురించి.......
🖋️తొమ్మిది పదులు దగ్గరపడినా తొనకని నిండుకుండలా చిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరుగా 62 పుస్తకాలు రాసి ఇంకా రాస్తూ (ముద్రితం కావాల్సి ఉంది) నేటి తరానికి ఆదర్శనీయులుగా నిలిచారు లగడపాటి భాస్కర్ నాయుడు సార్.
🖋️2010 వ సంవత్సరంలో పెద్దలు లగడపాటి భాస్కర్ సార్ దిశా నిర్దేశంతో గొడుగు చింత గోవిందయ్య,పట్ర జయచంద్ర రావు, నేను యువశ్రీ మురళి నలుగురం శ్రీకాళహస్తి వేదికగా ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళా వేదికను స్థాపించాము.
నాటి నుండి పట్టణంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మమ్మల్ని నడిపించిన పెద్దాయన ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా.
🖋️తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా వేదిక ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ భాషా పోటీలను నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో సెమినార్ లు,కవి సమ్మేళనాలు నిర్వహించడంలో మాతో పాటు నడిచిన సాహితీ కురువృద్ధులు మా లగడపాటి భాస్కర్ సార్.
🖋️శ్రీకాళహస్తి వేదికగా నభూతో నభవిష్యతి అన్న రీతిలో 2016 లో జాతీయ తెలుగు కవి సమ్మేళనం నిర్వహించడంలో నా వెన్ను తట్టి ముందుకు నడిపించారు. ఈ కవి సమ్మేళనంలో 4 రాష్ట్రాల నుంచి 157 మంది కవులు రచయితలు, సాహితీ సంస్థలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
🖋️ధూర్జటి సాహిత్యం - శ్రీకాళహస్తీశ్వర ప్రాశస్త్యం పేరుతో సెమినార్ ను నిర్వహించి ధూర్జటి గుండె చప్పుడు పేరుతో సంకలనం పుస్తకాన్ని తీసుకురావడంలో కృషి చేశారు.
🖋️ప్రతి ఉగాది, సంక్రాంతి కవిసమ్మేళనంలో ఏదో ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ నేటి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.గత 13 సంవత్సరాలుగా వేదికకు అధ్యక్షులుగా ఉంటూ మాతో నడుస్తూ, నడిపించారు.
🖋️చివరిదశలో వారు రాసిన పెద్ద శ్రీకాళహస్తి మహత్యం ధూర్జటి ముని మనవడు లింగరాజు కవి రాసిన దాన్ని వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో రాయగా త్వరలో ఆ పుస్తకాన్ని శ్రీకాళహస్తి క్షేత్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరణకు సిద్దమవుతున్నది.
🖋️వారి మరణం తెలుగు సాహితీ లోకానికి, ధూర్జటి రసజ్ఞ సమాఖ్య కు తీరని లోటు బరువెక్కిన బాధాతప్త హృదయంతో, శోకతప్త నయనాలతో..
వారి ఆఖరి కోరికగా తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టు ఉన్నట్టు శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో ధూర్జటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని కోరిక ఉన్నది అని తెలిపారు
No comments:
Post a Comment