ద్రావిడ వర్శిటీ పూర్వ విద్యార్థుల జె.ఎ.సి ఏర్పాటు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, May 1, 2022

ద్రావిడ వర్శిటీ పూర్వ విద్యార్థుల జె.ఎ.సి ఏర్పాటు

 ద్రావిడ వర్శిటీ పూర్వ విద్యార్థుల జె.ఎ.సి ఏర్పాటు


 - ఈ నెల 5 వ తేదీన వర్శిటీలో సమావేశం 


 - త్వరలో ప్రభుత్వానికి వి.సి., రిజిస్ట్రార్ల గురించి ఫిర్యాదు.




కుప్పం, స్వర్ణముఖి న్యూస్ ప్రతినిధ, సీ.ఎం.రమేష్ కుమార్ :

చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయమైన ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా అవగాహన లోపం, అసమర్థతతో అధికారులు ప్రవర్తిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా వందలమంది డిగ్రీ విద్యార్థులు అడ్మిషన్లు లేక రోడ్డున పడ్డారు, ఉపాధికి అత్యంత అవకాశాలున్న ప్రధాన కోర్సులు మూసివేశారు. ఈ విషయమై పలుమార్లు వర్శిటీ పూర్వ విద్యార్థులు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఎస్ ఎఫ్ ఐ, ఏం ఐ ఎస్ ఎఫ్, టి ఎన్ ఎస్ ఎఫ్, ఎన్.జి.ఒలు, కుల సంఘాలు, స్థానిక విద్యార్థులు కలిసి నిరసనలు తెలిపారు, వినతి పత్రాలు సమర్పించారు అయినా ఏమాత్రం పట్టించుకోని అధికారులు వర్శిటీ వినాశనానికి పూనుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు వర్శిటీ పూర్వ విద్యార్థులు ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కుప్పంలోని దక్షణి కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి  పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని జె.ఎ.సి  ఏర్పాటు చేసి వర్శిటీ పరిరక్షణకు ప్రణాళికలను సిద్ధం చేశారు. సెట్ తో సంబంధం లేకుండా డిగ్రీ అయిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని, అకడమిక్ సెనేట్ అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా మూసేసిన కోర్సులు ప్రారంభించాలని, వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులను ఫోన్ చేసి తిరిగి వారి వారి కోర్సుల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని, ఉపాధి అవకాశాలు, పరిశోధనలు జరిగేలా ఉండే మరిన్ని కోర్సులు ప్రవేశ పెట్టాలనే డిమాండ్లను ఈ సందర్భంగా తీర్మానించారు. ఈ నెల 5వ తేదీన వర్శిటీ పరిరక్షణకై అధికారుల నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలోనే వి.సి., రిజిస్ట్రార్ వ్యవహారంను ప్రభుత్వం దృష్టికి, మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పెద్ద ఎత్తున వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు నిర్ణయించారు. ఈ సమస్యలు వీలైనంత త్వరలో పరిష్కారం కానిచో పొరాటం ఇలాగే కొనసాగుతుందని, గౌరవ ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, విద్యా శాఖ మంత్రి గార్ల దృష్టికి తీసుకెళ్లి ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రరిరక్షణ కోసం పాటుపడుతామని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad