మే డే సందర్బంగా శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య అవగాహనా సదస్సు.
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మే డే సందర్భం గా నిర్వహించిన ఉచిత ఆరోగ్య అవగాహనా సదస్సు లో APSRTC సిబ్బంది వారి కుటుంబ సామెతం గా దాదాపు 100 మంది పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొన్నారు. ఈ సదస్సులో MGM హాస్పిటల్ వారు ప్రతి కార్మికుడు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా డాక్టర్ల సలహాల తో పాటు ఉచితంగా పరీక్షలు, ఉచితంగా మందులు అందజేశారు. పై శిబిరం లో MGM హాస్పిటల్ *డైరెక్టర్ గుడ్లూరు మయూర్* మాట్లాడుతూ మే డే సందర్బంగా శ్రీకాళహస్తి APSRTC లోని ప్రతి కార్మికుల కుటుంబఆరోగ్యలను దృష్టిలో ఉంచుకొని వారి కొరకు ఈ క్యాంపు పెట్టామని రాబోయే రోజుల్లో కార్మికులందరూ ESI,EHS లాంటి సేవలు వినియోగించుకోవాలని మా హాస్పిటల్ నందు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. APSRTC *D.M A. సుబ్రహ్మణ్యం* గారు మాట్లాడుతూ MGM హాస్పిటల్ వారు APSRTC వారి ఆరోగ్యం కోసం ఉచితం గా నిర్వహించిన ఈ సదస్సు మా సిబ్బంది కి చాలా ఉపయోగపడిందని, మేమందరం ఎంతో సంతోష పడ్డామని ఈ కార్యక్రమం నిర్వహించిన *డైరెక్టర్ మయూర్* గారికి చాలా ధన్యవాదములు అని తెలిపారు. హాజరైన సిబ్బంది అందరు కృతజ్ఞతలు తెలిపారు. పై కార్యక్రమం లో MGM హాస్పిటల్ డాక్టర్స్ *శ్రీ బంగం వివేక్ చైతన్య ( గుండె వైద్య నిపుణులు) మరియు శ్రీ అమ్మినేని దేవేంద్రనాయుడు (అత్యవసర వైద్య సేవలు)* గార్లు, నర్సులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment