సోమవారం, మృత్యుంజయ స్వామి ప్రత్యేక,అభిషేకం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, June 11, 2024

సోమవారం, మృత్యుంజయ స్వామి ప్రత్యేక,అభిషేకం

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ,సోమవారం , సందర్భంగాశ్రీ మృత్యుంజయ స్వామి వారికి, ప్రత్యేక,అభిషేక పూజలు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు.. 












స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

వాయు లింగేశ్వరుని సన్నిధి,లో ,సోమవారం సందర్భంగాప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు,  ఆలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్ధిత సేవలో భక్తులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి,సోమవారం ,నిపురస్కరించుకొనిమృత్యుంజయస్వామిఅభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి, మృత్యుంజయ స్వామి మూలవిరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తం గా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయస్వామికి ,సోమవారం ప్రత్యేక అభిషేక సేవ ను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ ,ఆలయ అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Post Bottom Ad