సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 204 వ జయంతి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
విజ్ఞానాన్ని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయులు శాస్త్రజ్ఞులు తత్వవేత్త కార్మికవర్గ పరిరక్షకులు మార్క్సిస్టు మహోపాధ్యాయలు డాక్టర్ కారల్ మార్క్స్ చీకటి నుంచి జనించి చీకటిని సృష్టించే అజ్ఞానాన్ని చెదరగొట్టడానికి సమస్త మానవ జాతికి నూతన యుగాన్ని సృష్టించడానికి ప్రపంచవ్యాపితంగా మెరుపులనువిరజిమ్మిన మహా మేధావి మార్క్స్. ,,*సకల దేశాల కార్మికులారా ఏకంకండి" అనే అమర నినాదం యావత్ కార్మిక లోకానికి నూతన ఉత్తేజాన్ని విప్లవ శంఖాన్ని పూరించింది. మే 5 .1818 లో జన్మించి 1883 మార్చి 14న మార్క్స్ మరణించేవరకు ఆయన గమనం సామ్రాజ్య వాదుల గుండెల్లో అలజడి సృష్టించి ప్రపంచం దిక్కులు పిక్కటిల్లేలా గడగడ వణికింది అలా ఆ మహనీయుని ప్రస్థానం నేటికీ 204 సంవత్సరాలు కావస్తున్నా వారి నిలువెత్తు త్యాగం కీర్తి ప్రతిష్టలు మార్క్సిజం సజీవంగా మిగిలాయి నేడు వారి జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పిద్దాం .ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య గారు , నియోజకవర్గ పర్యవేక్షకులు అంగేరి పుల్లయ్య గారు ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దాసరి జనార్దన్ గారు , పార్టీ పట్టణ కార్యదర్శి గంధం మణి గారు , తొట్టంబేడు కార్యదర్శి గురవయ్య గారు , యువజన సంఘం నాయకులు వెంకటేష్, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment