రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి: దాసరి జనార్ధన్ పిలుపునిచ్చారు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, May 5, 2022

రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి: దాసరి జనార్ధన్ పిలుపునిచ్చారు

 ఈనెల 19, 20 తేదీల్లో శ్రీకాళహస్తి లో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

 


స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి

    శ్రీకాళహస్తిపట్టణంలో ని సుందరయ్య భవన్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, సంఘం పూర్వ కార్యదర్శి అంగేరి  పుల్లయ్య పిలుపునిచ్చారు.

   గురువారం నాడు సుందరయ్య భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజీలేని పోరాటం చేసిందని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా ఉమ్మడి సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతుల బకాయిలపై, విద్యుత్ సమస్యలపై, గిట్టుబాటు ధరల సమస్యలపై, మార్కెట్ సమస్యలపై, ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై, అక్రమ ఇసుక రీచ్ ల రద్దు కొరకు, మామిడి రైతులు, పాలు రైతులు, ఇలా అనేక పోరాటాలు చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

      ఢిల్లీలో రైతాంగం నిర్వహించిన సుదీర్ఘ పోరాటానికి సంఘీభావంగా మన జిల్లాలో చేసిన అనేక పోరాటాలు చేసిందని వారు గుర్తు చేశారు.

     జిల్లాల విభజన అనంతరం తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి , నియోజకవర్గాలతో కలిపి ప్రథమ మహాసభ లను శ్రీకాళహస్తిలో పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని రైతులు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కూలీలు, అందరూ ఆర్థికంగా  సహకరించాలని ఈ సభల జయ ప్రధాని కి రైతులు ప్రజలు అందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ గారు సంఘ నాయకులు గంధం మణి, పెనగడం  గురవయ్య, వెంకటేష్, ధన శేఖర్, కామేష్, శంకరయ్య, బాల గురవయ్య ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad