11 ఎర్రచందనం దుంగలతో ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
వెంకటగిరి రేంజ్ యల్లంపల్లి సమీపంలో 11 ఎర్రచందనం దుంగలతో ఇద్దరు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు నేతృత్వంలో డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ ఐ కృపానంద టీమ్ బుధవారం మామండూరు ఫారెస్ట్ నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరు వెంకటగిరి రేంజ్ యల్లంపల్లి ప్రాంతం చేరుకోగానే కొందరు ఎర్రచందనం దుంగలతో కనిపించారు. వారిని చుట్టు ముట్టే లోపు అందరూ పారిపోగా ఇద్దరిని పట్టుకోగలిగారు. వీరిని తమిళనాడు ఊట్టుకోటకు చెందిన రాజా సుబ్రమణి (34), అన్నమయ్య జిల్లా పెనగళూరుకు చెందిన మొగిలి చెర్ల పెంచలయ్య (41) గా గుర్తించారు. వీరిని సిఐ విచారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుంగలు 243 కిలోల బరువు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
No comments:
Post a Comment