శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్న మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
దక్షిణ కాశీ గా పేరుపొందిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం దర్శనార్థం మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ విచ్చేసినారు. ఆలయం తరపున ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబసమేతముగా వివిఎస్ లక్ష్మణ్ స్వామి అమ్మవారి రుద్రాభిషేకం చేసుకొన్నారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద ఆలయం తరఫున వేదపండితుల మంత్రోచ్ఛారణల తో ఆలయ అధికారుల చేతులమీదుగా తీర్థప్రసాదాలు అందించారు.
వివిఎస్ లక్ష్మణ్ అనగా వేంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్. విఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం బి సి సి ఐ అడ్వైస్సర్ కమిటీ మెంబెర్ గా వున్నారు. ఇంటెర్నేషన్ క్రికెట్ ఆటలో రాణించాడు. ఆగష్టు 2012 లో ఇంటెర్నేషన్ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటిచ్చాడు. వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ ప్రయాణం 1996 -2012 వరకు సాగినది. ప్రపంచ క్రికెట్ లో రాణించిన వివిఎస్ లక్ష్మణ్ కు 2001 లో అర్జున్ అవార్డు , 2011 పద్మశ్రీ అవార్డు తీసుకొన్నారు
No comments:
Post a Comment