ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం,మాసారపు వెంకటసుబ్బయ్య నగర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉదయం నుండి ముస్లిం సోదరీమణులతో పాటు ఉపవాసం చేసి సాయంకాలం ఉపవాస దీక్ష ముగించారు శ్రీ పవిత్ర రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు భారీ ఎత్తున ఇఫ్తార్ విందుకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఇప్పటివరకు ఏ శాసనసభ్యుడు ముస్లింలకు ఇంత భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వలేదని మధుసూదన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు అని అలాగే నిరుపేద ముస్లిం కుటుంబాల కల్యాణం కొరకు మేనమామ సాంగ్యం అందజేస్తున్నారని తెలిపారు
No comments:
Post a Comment